Pawan Kalyan - Ram Charan: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన ఖాతాలో పలు సినిమాలు ఉండగా.. మరిన్ని సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు. ఇక ఈయన సినిమాల విషయం పక్కన పెడితే బిజినెస్ పరంగా కూడా చెర్రీ బాగా యాక్టివ్ గా కనిపిస్తాడు. ఇప్పటికే పలు బిజినెస్ రంగంలో దూసుకుపోతున్నాడు. పలు సంస్థలతో పెట్టుబడులు కూడా పెట్టాడు. ఇదిలా ఉంటే తాజాగా మరో బిగ్ స్టెప్ వేశాడు.
ఇప్పటికే పలు వ్యాపార రంగంలో బిజీగా ఉండగా మరో వ్యాపారంపై దృష్టి పెట్టాడు. త్వరలోనే ఓ టీవీ న్యూస్ ఛానల్ ను కొనబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆ ఛానల్ యజమానితో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాడట. ఇక ఆ ఛానల్ పాపులర్ ఛానల్ కూడా కాదని ఇంతవరకు అది అభివృద్ధి కాలేదని.. అందుకే ఆ ఛానల్ ను అభివృద్ధి చేయాలని చెర్రీ నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి:‘భీమ్లా నాయక్’ సినిమా విషయంలో ఆ యువ దర్శకుడికి అన్యాయం జరుగుతుందా..?
అంతేకాకుండా ఆ ఛానల్ కు మంచి ఆఫర్ కూడా అందించాడట. ఇక ఈ ఛానల్ ను సొంతం చేసుకోడానికి మరో కారణం ఉందని తెలుస్తుంది. ఇంతకీ ఆ కారణం ఏదో కాదు తన బాబాయ్ పవన్ కళ్యాణ్ అని టాక్ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ కోసం చెర్రీ ఈ నిర్ణయం తీసుకున్నాడట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన బాబాయ్ పార్టీకి మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ఈ ఛానల్ ను తీసుకున్నట్లు తెలుస్తుంది. వీటితో పాటు మరో రెండు ఛానళ్లు కూడా తీసుకోనునే ఆలోచనలు చేస్తున్నాడట చెర్రీ.
ఇది కూడా చదవండి:రామ్ చరణ్, శంకర్ సినిమా లాంఛింగ్ గ్లింప్స్ విడుదల..
మరీ రామ్ చరణ్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ ఒకవేళ ఇది నిజమైతే పవన్ కు గట్టి పోటీ ఉంటుందని చెప్పవచ్చు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు ఆచార్య సినిమాలో కూడా నటిస్తున్నాడు. అంతేకాకుండా క్రేజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mega power star, Pawan kalyan, Ram Charan, Tollywood, Tv channel