MEGA POWER STAR RAM CHARAN WIFE UPASANA KONIDELA SPECIAL INTERVIEW WITH BOLLYWOOD TOP HERO SALMAN KHAN TA
సల్మాన్ కోసం యాంకర్ అవతారం ఎత్తిన రామ్ చరణ్ వైఫ్ ఉపాసన..
సల్మాన్‌ను స్పెషల్‌గా ఇంటర్వ్యూ చేసిన ఉపాసన కొణిదెల
మెగా ఫ్యామిలీకి సల్మాన్ ఖాన్‌కు ఉన్న అనుబంధం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మెగా కుటుంబంలో రామ్ చరణ్‌కు సల్మాన్‌కు మధ్య మంచి రిలేషనే ఉంది. రామ్ చరణ్ ఎపుడు ముంబాయి వెళ్లిన సల్మాన్ ఖాన్‌ను కలుస్తునే ఉంటాడు. తాజాగా సల్మాన్ ఖాన్..తన తాజా చిత్రం ‘భారత్’ మూవీ ప్రమోషన్లో భాగంగా మెగా కోడలు ఉపాసనకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు.
మెగా ఫ్యామిలీకి సల్మాన్ ఖాన్‌కు ఉన్న అనుబంధం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మెగా కుటుంబంలో రామ్ చరణ్‌కు సల్మాన్‌కు మధ్య మంచి రిలేషనే ఉంది. రామ్ చరణ్ ఎపుడు ముంబాయి వెళ్లిన సల్మాన్ ఖాన్‌ను కలుస్తునే ఉంటాడు. మరోవైపు సల్మాన్ కూడా హైదరాబాద్ వస్తే రామ్ చరణ్‌ను కలిసి కానీ వెళ్లడు. తాజాగా సల్మాన్ ఖాన్..తన తాజా చిత్రం ‘భారత్’ మూవీ ప్రమోషన్లో భాగంగా మెగా కోడలు ఉపాసనకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో ఉపాసన.. సల్మాన్ ఖాన్ ఆరోగ్య విషయాలతో పాటు, ఫిట్‌నెస్‌కు సంబంధించిన తదితర విషయాలను ఈ ఇంటర్వ్యూలో అడిగారు.దానికి సల్మాన్ ఎంతో ఓపిగ్గా ఉపాసన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ముఖ్యంగా ‘భారత్’ చిత్రానికి సంబంధించిన క్వశ్చన్స్ కాకుండా కాస్తా వెరైటీగా ఈ ఇంటర్వ్యూ సాగింది. ఈ సందర్భంగా ఉపాసన సల్మాన్ ఖాన్‌లో కొత్త యాంగిల్‌ను ఇంటర్వ్యూ చేసినట్టు తన ట్వీట్లో తెలిపింది.
— Upasana Konidela (@upasanakonidela) June 7, 2019
ప్రెజెంట్ ఉపాసన అపోలో గ్రూప్‌కు సంబంధించిన బి-పాజిటివ్ మ్యాగజైన్‌కు సంబంధించిన వ్యవహారాలను చూస్తుంది. ఈ సందర్భంగా పాఠకులను ఆకట్టుకునేందుకు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసారు. తాజాగా సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలను ఈ ఇంటర్య్యూలో అడగడం విశేషం.