Kiran Kumar ThanjavurKiran Kumar Thanjavur
|
news18-telugu
Updated: December 31, 2019, 7:03 AM IST
రామ్ చరణ్ (Ram Charan)
2019లో రామ్ చరణ్ హీరోగా సక్సెస్ అందుకోకపోయినా.. నిర్మాతగా మాత్రం తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’తో విజయం అందుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ‘RRR’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు. ఇద్దరు చారిత్రక యోధులు కలిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో జక్కన్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తర్వాత రామ్ చరణ్..తండ్రి చిరంజీవితో కలిసి మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ సినిమా రీమేక్‌లో నటించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. కానీ రామ్ చరణ్ ఈ రీమేక్ రైట్స్ తీసుకున్నా.. ఇందులో నటించేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా రామ్ చరణ్.. రీసెంట్గా కార్తితో ‘ఖైదీ’ వంటి డిఫరెంట్ మూవీతో ఆకట్టుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. ఇప్పటికే లోకేష్ కనకరాజ్.. రామ్ చరణ్ ఇమేజ్‌కు తగ్గ ఒక లైన్ వినిపించి ఒకే చేయించుకున్నాడట. చరణ్ కూడా ఈ లైన్‌ను లోకేష్‌ను డెవలప్ చేయమని చెప్పినట్టు సమాచారం. మరోవైపు చెర్రీ.. హరీష్ శంకర్ చెప్పిన ఓ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలో ఈ రెండు సినిమాల విషయమై అఫీషిలయ్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
December 31, 2019, 7:01 AM IST