Rajamouli-Ram Charan:నా మార్గదర్శి రాజమౌళికి హ్యాపీ బర్త్ డే అంటూ రామ్ చరణ్ విషెస్..

Rajamouli-Ram Charan | ఈ రోజు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్.. తన మెంటర్ రాజమౌళికి స్పెషల్‌గా బర్త్ డే విషెస్ తెలియజేసాడు.

news18-telugu
Updated: October 10, 2020, 1:23 PM IST
Rajamouli-Ram Charan:నా మార్గదర్శి రాజమౌళికి హ్యాపీ బర్త్ డే అంటూ రామ్ చరణ్ విషెస్..
రాజమౌళికి రామ్ చరణ్ విషెస్ (Twitter/Photo)
  • Share this:
Rajamouli-Ram Charan | ఈ రోజు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, అజయ్ దేవ్‌గణ్ సహా ఆర్ఆర్ఆర్ టీమ్ జక్కన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. మరోవైపు రామ్  చరణ్ కూడా రాజమౌళికి స్పెషల్‌గా బర్త్ డే విషెస్ తెలియజేసాడు. క్రిటిక్స్‌కు సైతం ఊహించని విజయాలు రాజమౌళి సొంతం అంటూ.. సినిమాల్లో నా మార్గదర్శి అంటూ రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసాడు అల్లూరి సీతారామరాజు. ప్రస్తుతం జక్కన్న తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్.. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే చెర్రీ బర్త్ సందర్భంగా విడుదలైన లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.


ఇక రామ్ చరణ్.. గతంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మగధీర’తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసాడు. అంతేకాదు చరణ్ .. హీరోగా ఇప్పటి వరకు ఏ దర్శకుడితో రెండో చిత్రం చేయలేదు. ఇపుడు రాజమౌళి దర్శకత్వంలో రెండో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మరో కథానాయికుడిగా నటిస్తే.. మూడో హీరోగా బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్‌గణ్.. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. మొత్తంగా పుట్టినరోజు సందర్భంగా రాజమౌళికి వివిధ ప్రముఖులు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 10, 2020, 1:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading