ప్రభాస్ పుట్టినరోజున అపురూపమైన ఫోటో షేర్ చేసిన రామ్ చరణ్..

ఈ బుధవారం ప్రభాస్ 40వ పుట్టినరోజును జరుపుకున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలో ఉన్న హీరో, హీరోయిన్లు, టెక్నీషియన్స్ అందరు డార్లింగ్‌కు బర్త్ డే విషెస్ అందజేశారు. ఇక మెగా పవర్  స్టార్ రామ్ చరణ్ కూడా ప్రభాస్‌కు వెరైటీగా బర్త్ డే విషెస్ తెలిపాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: October 24, 2019, 7:10 AM IST
ప్రభాస్ పుట్టినరోజున అపురూపమైన ఫోటో షేర్ చేసిన రామ్ చరణ్..
రామ్ చరణ్,ప్రభాస్ (Instagram/Photo)
  • Share this:
ఈ బుధవారం ప్రభాస్ 40వ పుట్టినరోజును జరుపుకున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలో ఉన్న హీరో, హీరోయిన్లు, టెక్నీషియన్స్ అందరు డార్లింగ్‌కు బర్త్ డే విషెస్ అందజేశారు. ఇక మెగా పవర్  స్టార్ రామ్ చరణ్ కూడా ప్రభాస్‌కు వెరైటీగా బర్త్ డే విషెస్ తెలిపాడు. ఈ సందర్భంగా ప్రభాస్‌తో ఒక పార్టీలో డాన్స్ చేస్తున్న ఫోటోను షేర్ చేసాడు. గతంలో వీళ్లిద్దరు ‘సైరా నరసింహారెడ్డి’ ప్రమోషన్ కార్యక్రమాల్లో కలిసారు. ఇక ప్రభాస్ విషయానికొస్తే.. బాహుబలి తర్వాత ‘సాహో’తో రీసెంట్‌గా ప్రేక్షకులను పలకరించాడు.ఈ సినిమా అనుకున్న ఫలితాన్ని సాధించకపోయినా.. బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్లకు పైగానే రాబట్టి హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో చూపించాడు. ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నాడు.



రామ్ చరణ్ విషయానికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే యేడాది జూలై 30న విడుదల కానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ చేస్తున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ ఈ చిత్రంలో కొమరం భీమ్ పాత్ర చేస్తున్నాడు.
First published: October 24, 2019, 7:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading