అలా చేయడమే నా బర్త్ డే గిఫ్ట్‌గా భావిస్తా.. రామ్ చరణ్..

తన పుట్టినరోజున అభిమానులు.. ఎక్కడ బయటకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండి కరోనా మహామ్మారిపై పోరాడాలని పిలుపునిచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

news18-telugu
Updated: March 27, 2020, 8:00 AM IST
అలా చేయడమే నా బర్త్ డే గిఫ్ట్‌గా భావిస్తా.. రామ్ చరణ్..
రామ్ చరణ్ (Twitter/Photo)
  • Share this:
తన పుట్టినరోజున అభిమానులు.. ఎక్కడ బయటకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండి కరోనా మహామ్మారిపై పోరాడాలని పిలుపునిచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అంతేకాదు నిన్న రాత్రి నుంచి తనకు ఎంతో మంది సన్నిహితులు, అభిమానులు ఫోన్ చేసి అభినందలు తెలియజేసినట్టు చెప్పుకొచ్చారు. ఈ రోజు రామ్ చరణ్ 35వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా చిరంజీవి.. రామ్ చరణ్ చిన్నప్పటి ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా 1920 బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. మరోవైపు కరోనా మహామ్మారిపై పోరులో భాగంగా రామ్ చరణ్ మొత్తంగా రూ.70 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.First published: March 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు