ప్రస్తుతం తెలుగు హీరోలు వేరే హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి వెనకాడటం లేదు. ఇప్పటికే రామ్ చరణ్.. తన తోటి హీరో ఎన్టీఆర్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ అనే మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్‌తో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా నటిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు.. తాజాగా రామ్ చరణ్.. తన తండ్రి చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న చిత్రంలో ముఖ్యపాత్రలో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. తాజాగా రామ్ చరణ్.. క్రిష్ దర్శకత్వంలో బాబాయి పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న చిత్రంలో అతిథి పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.పండగ సాయన్న జీవిత నేపథ్యంలో ‘విరూపాక్షి’ అనే టైటిల్ ప్రచారం జరుగుతున్న ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్ర ఉందట. అది ఓ హీరో చేస్తేనే బాగుంటుందని క్రిష్.. పవన్ కళ్యాణ్‌కు సూచించారట.

చిరంజీవి,పవన్ కళ్యాణ్,రామ్ చరణ్ (Facebook/Photos)
దాంతో పవన్.. తన అన్న కొడుకు రామ్ చరణ్‌ను కలిసి ఈ స్టోరీ వినిపించమని క్రిష్‌ను కోరాడట. దీంతో క్రిష్ రామ్ చరణ్‌కు ఈ సినిమాలో అతని పాత్రను వివరించాడట. ఇక బాబాయితో సినిమా అనగానే రామ్ చరణ్ వెంటనే ఈ ప్రాజెక్ట్‌ను ఓకే చెేసినట్టు మెగా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. త్వరలో రామ్ చరణ్ ఈ సినిమాలో నటించే విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:April 07, 2020, 12:29 IST