Home /News /movies /

Mega Power Star Ram Charan: మలయాళ చిత్రాన్ని మల్టీస్టారర్‌గా రీమేక్ చేస్తున్న చెర్రీ.. ఇద్దరూ స్టార్‌లే..!!

Mega Power Star Ram Charan: మలయాళ చిత్రాన్ని మల్టీస్టారర్‌గా రీమేక్ చేస్తున్న చెర్రీ.. ఇద్దరూ స్టార్‌లే..!!

Mega power star Ram Charan looking to remake Malayalam movie Driving License

Mega power star Ram Charan looking to remake Malayalam movie Driving License

Mega Power Star Ram Charan: మలయాళ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్ చిత్రాన్ని నిర్మాతగా తెలుగులో రీమేక్ చేయడానికి రామ్‌చరణ్ ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం

    ఏదైనా ఒక భాషలో వచ్చిన సినిమా సూపర్ డూపర్ హిట్టయితే దానిపై మిగతా సినిమా ఇండస్ట్రీల కన్నుపడటం సహజమే. ఇలా తెలుగు సినిమాలో ఎన్నో బ్లాక్ బ్లస్టర్, బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాలు తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో.. అక్కడి సినిమాలు ఇక్కడ చాలానే రీమేక్‌లు జరిగాయి. ఆ సినిమాలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి కూడా. ఈ మధ్య ఎక్కువగా హీరోలు కూడా రీమేక్ సినిమాలకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరోవైపు దర్శకులు కూడా త్వరగా సినిమా అయిపోతుందని.. నిర్మాతలు కూడా తక్కువ బడ్జెట్టే కదా.. అని ఒప్పేసుకుని చకచకా పనులు కానిచ్చేస్తున్నారు.

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా రీమేక్ సినిమాలను నిర్మించడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాడు. ఇప్పటికే మలయాళంలో మోహన్ లాల్ ప్రధానపాత్రలో నటించిన ‘లూసీఫర్’ రీమేక్ రైట్స్ కొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అదే ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్టయ్యి, కలెక్షన్ల వర్షం కురిపించిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ అనే మూవీ రీమేక్ రైట్స్ కొన్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. మలయాళంలో ఈ సినిమాను జీన్ పాల్ లాల్ తెరకెక్కించగా.. పృథ్వీరాజ్, సురాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. లాక్ డౌన్‌లో సినిమా చూసిన చెర్రీ.. తెగ ఎంజాయ్ చేశాడట. ఆలస్యం చేయకుండానే ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ రైట్స్ కొనేశాడట. ఇద్దరు స్టార్‌లను పెట్టి మల్టీస్టారర్‌గా తెరకెక్కించాలని అనుకున్నాడట.

    అప్పట్లో బాబాయ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని భావించినప్పటికీ వర్కవుట్ కాలేదట. ఈ మధ్యే ఈ సినిమాలో ఎవర్ని తీసుకోవాలనే దానిపై ఓ నిర్ణయానికి వచ్చాడట. మల్టీస్టారర్‌గా తెరకెక్కించాలని భావించిన చెర్రీ.. ఇద్దరూ స్టార్‌లనే ఎంపిక చేసుకున్నాడట. పృథ్వీరాజ్ పాత్రలో మాస్ మహారాజ్ రవితేజ, సురాజ్ పాత్రలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని ఫిక్స్ చేసేశాడట. దీని గురించి ఇప్పటికే ఇద్దరితోనూ డిస్కషన్ కూడా చేశాడట. ఆ ఇద్దరు స్టార్‌లు ‘మేం.. ఓకే’ అని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారట. అయితే డైరెక్టర్ ఎవరైతే బాగుంటుంది..? తెలుగులో ఎవరైనా యంగ్ డైరెక్టర్‌ను తీసుకుంటే మంచిదా..? లేకుంటే మలయాళ డైరెక్టర్‌నే తీసుకోవాలా..? ఇంకా మిగిలిన పాత్రలకు ఎవరెవర్ని తీసుకోవాలి అనే దానిపై యోచిస్తున్నాడట. చాలా రోజులుగా రీమేక్ రైట్స్ గురించి వార్తలు రాగా.. తాజాగా పాత్రధారులు కూడా ఫిక్స్ అయ్యారన్న వార్తలు వస్తున్నాయ్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే.
    Published by:Anil
    First published:

    Tags: Malayala Cinema, Ram Charan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు