HOME »NEWS »MOVIE »mega power star ram charan grand entry into chiranjeevi koratala sivas acharya set in siddha role ta

Ram Charan - Acharya: ‘ఆచార్య’ సెట్‌లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. సిద్ధగా పలకరించనున్న మెగా పవర్ స్టార్..

Ram Charan - Acharya: ‘ఆచార్య’ సెట్‌లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. సిద్ధగా పలకరించనున్న మెగా పవర్ స్టార్..
’ఆచార్య’ సిద్ధ పాత్రలో రామ్ చరణ్ (Twitter/Photo)

Acharya - Chiranjeevi - Ram Charan | మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ చిత్రంపై  అంచనాలు ఎంత భారీగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌లో రామ్ చరణ్ ఈ రోజు జాయిన్ అయ్యాడు.

  • Share this:
    Acharya - Chiranjeevi - Ram Charan | మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ చిత్రంపై  అంచనాలు ఎంత భారీగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోవిడ్ ఆంక్షల తర్వాత రీసెంట్‌గా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌లో చిరంజీవి జాయిన్ అయ్యారు. మరోవైపు రామ్ చరణ్ కూడా ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయిదానుకునే లోపు కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా రామ్ చరణ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ‘ఆచార్య’ సెట్‌లో అడుగు పెట్టాడు. ఈ రోజు నుంచి రామ్ చరణ్.. ఆచార్య రెగ్యులర్ షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంగా మా ‘సిద్ధ’ సర్వం అంటూ దర్శకుడు కొరటాల శివ.. రామ్  చరణ్‌కు స్వాగతం పలికాడు.

    ‘ఆచార్య’లో రామ్ చరణ్ అతిథి పాత్ర కాకుండా.. పూర్తి స్థాయిలో నటించబోతున్నట్టు సమాచారం. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే రామ్ చరణ్ పాత్ర ఈ సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. ఇందులో రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే  నక్సలైట్ పాత్రను చేయనున్నట్టు సమాచారం. ఈ  పాత్రను కేవలం రామ్ చరణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసాడు కొరటాల. ఇప్పటికే మగధీర, బ్రూస్లీ, ఖైదీ నెం 150 సినిమాల్లో కలిసి కనిపించారు చిరు, రామ్ చరణ్. కానీ అవన్నీ కొన్ని నిమిషాల పాటు వచ్చి మాయం అవుతుంటాయి. కానీ ఆచార్యలో అలా కాదు.. దాదాపు చిరంజీవి, రామ్  చరణ్ స్క్రీన్ పై  అరగంటకు పైనే ఉంటుందని సమాచారం. కానీ కొరటాల శివ మాత్రం ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రను గంట వరకు పొడిగించినట్టు సమాచారం.

    ఈ సినిమాలో దేవాలయం సెట్ కోసం  దాదాపు 10 కోట్లను ఖర్చు చేసారు. హైద‌రాబాద్ శివారులోని కోకాపేట్‌లో 20 ఎక‌రాల విస్తీర్ణంలో ఈ చిత్రం కోసం టెంపుల్ టౌన్ సిటీ ఫోటోలు కూడా చిరు షేర్ చేసాడు. క‌ళా ద‌ర్శ‌కుడు సురేష్ నేతృత్వంలో రూపొందించిన ఈ టెంపుల్ సిటీ సెట్‌కి సంబంధించి చిరంజీవి షేర్ చేసిన వీడియో వైరల్ అయింది. ఇక్కడే దాదాపు సగం షూటింగ్ పూర్తి చేయనున్నాడు కొరటాల శివ.

    chiranjeevi, koratala siva, mega star chiranjeevi, aacharya, chiranjeevi 152nd movie, chiranjeevi aacharya, chiranjeevi comedy, aacharya shooting, ram charan, aacharya latest update, chiranjeevi movie update, చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి, ఆచార్య
    చిరంజీవి, కొరటాల శివ (File/Photo)

    ఇప్పటికే ఇక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. చిరంజీవి సినిమాకు చాలా ఏళ్ళ తర్వాత మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. దర్శకుడిగా తన కెరీర్ మొదలు పెట్టిన తర్వాత దేవీ శ్రీ ప్రసాద్ కాకుండా బయటి మ్యూజిక్ డైరెక్టర్‌తో కొరటాల పని చేయడం ఇదే తొలిసారి.

    Mega Power Star Ram Charan Grand Entry into Chiranjeevi Koratala sivas Acharya Set in siddha Role  Ram Charan - Acharya: ‘ఆచార్య’ సెట్‌లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. సిద్ధగా పలకరించనున్న మెగా పవర్ స్టార్..,acharya,Ram Charan,Ram Charan As Siddha In Acharya Movie,Ram Charan as siddha,Acharya ram charan,Acharya Chiranjeevi,Chiranjeevi Ram Charan koratala siva,acharya movie may 9th release,chiranjeevi acharya movie updates,chiranjeevi,chiranjeevi acharya,chiranjeevi acharya movie,megastar chiranjeevi,chiranjeevi new movie,chiranjeevi 152 movie,acharya teaser,acharya movie chiranjeevi,chiranjeevi 152 movie release date,acharya movie teaser,chiranjeevi latest movie,acharya movie release update,acharya movie temple set,chiranjeevi acharya movie updates,chiranjeevi 152 release date,చిరంజీవి ఆచార్య,ఆచార్య రిలీజ్ డేట్,చిరంజీవి ఆచార్య విడుదల మే 9న,చిరంజీవి రామ్ చరణ్ ఆచార్య,ఆచార్యలో రామ్ చరణ్ పాత్ర పొడిగింపు,సిద్ధగా రామ్ చరణ్,సిద్ధ గా రామ్ చరణ్

    ఆచార్య కోసం 30 రోజులు డేట్స్ ఇచ్చాడు చరణ్. ఆయన పార్ట్ త్వరగా పూర్తి చేస్తే సినిమా విడుదల కూడా ముందుగానే అవుతుందని ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. ఈ సినిమాను మే 9న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ డేట్‌లో చిరంజీవి నటించిన ‘జగదేవవీరుడు అతిలోకసుందరి’, గ్యాంగ్ లీడర్’ సినిమాలు రిలీజై.. బ్లాక్ బస్టర్‌తో పాటు ఇండస్ట్రీ హిట్‌ను నమోదు చేసాయి. ఇపుడు అదే డేట్‌లో విడుదల కాబోతున్న ఈ సినిమాతో చిరంజీవి, రామ్ చరణ్‌లు  మరో ఇండస్ట్రీ హిట్‌ను నమోదు చేస్తారా లేదా అనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:January 17, 2021, 11:00 IST