Ram Charan: కొరటాల శివకు రామ్ చరణ్ బంపర్ ఆఫర్.. హలో ‘ఆచార్య’..

Ram Charan Koratala Siva: రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తైపోయింది. కరోనా లేకపోయుంటే ఈ పాటికే అయిపోయి ఉండేది కూడా. జనవరి 8న విడుదలకు సిద్ధమయ్యేది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 25, 2020, 9:31 PM IST
Ram Charan: కొరటాల శివకు రామ్ చరణ్ బంపర్ ఆఫర్.. హలో ‘ఆచార్య’..
కొరటాల శివ రామ్ చరణ్ (ram charan koratala siva)
  • Share this:
రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తైపోయింది. కరోనా లేకపోయుంటే ఈ పాటికే అయిపోయి ఉండేది కూడా. జనవరి 8న విడుదలకు సిద్ధమయ్యేది. కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. ట్రిపుల్ ఆర్ షూటింగ్ కాస్తా ఆర్నెళ్లుగా ఆగిపోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు కొరటాల శివ ఆచార్య సినిమాకు కూడా కమిట్‌మెంట్ ఇచ్చాడు చరణ్. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అతి కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు ఈయన. దీనిపై టీం కూడా క్లారిటీ ఇచ్చింది.
రామ్ చరణ్ (ram charan)
రామ్ చరణ్ (ram charan)


ఇందులో చరణ్ తనకు శిష్యుడు లాంటి పాత్రలో కనిపిస్తున్నాడని మెగాస్టార్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. దానికితోడు మోషన్ పోస్టర్ కూడా అదిరిపోవడంతో అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై మాత్రం చాలా మందికి క్లారిటీ లేదు. మరోవైపు చిరంజీవి కూడా ఇప్పట్లో తాను షూటింగ్‌కు రాలేనని చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. డిసెంబర్ తర్వాతే ఈయన షూటింగ్‌కు వస్తాడు. దాంతో కొరటాల శివ కూడా చేసేదేం లేక ఖాళీగానే ఉండిపోయాడు. అయితే ఇలాంటి సమయంలో ఈ దర్శకుడికి అదిరిపోయే బంపర్ ఆఫర్ ఇచ్చాడు రామ్ చరణ్.
కొరటాల శివ రామ్ చరణ్ (ram charan koratala siva)
కొరటాల శివ రామ్ చరణ్ (ram charan koratala siva)

అది విన్న తర్వాత కొరటాల కూడా ఖుషీ అవుతున్నాడు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని దర్శకుడికి చెప్పేసాడు రామ్ చరణ్. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ షూట్ కూడా లేకపోవడంతో ఆచార్యలో తన పార్ట్ పూర్తి చేయాలని కొరటాలను కోరుతున్నాడు మెగా పవర్ స్టార్. కుదిర్తే చిరంజీవిని కూడా షూటింగ్‌కు తీసుకొస్తానని కొరటాలకు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్టోబర్, నవంబర్‌లో ఆచార్య షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నాడు రామ్ చరణ్. ఈ రెండు నెలల్లో తన పార్ట్ పూర్తి చేయనున్నాడు ఈయన. రామ్ చరణ్ ఇచ్చిన ధైర్యంతో కొరటాల కూడా రెడీ అవుతున్నాడు.
కొరటాల శివ రామ్ చరణ్ (ram charan koratala siva)
కొరటాల శివ రామ్ చరణ్ (ram charan koratala siva)

ఆర్నెళ్ళ తర్వాత మళ్లీ ఆచార్యను పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నాడు మెగా డైరెక్టర్. ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమాతో బిజీ కానున్నాడు రామ్ చరణ్. మరోవైపు రాజమౌళి దసరా తర్వాత ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. కానీ ముందు జూనియర్ ఎన్టీఆర్ సీన్స్ చిత్రీకరించాలని చూస్తున్నాడు దర్శక ధీరుడు. దాంతో కొన్ని రోజులు బ్రేక్ దొరకుతుంది చరణ్‌కు. అదే సమయం ఆచార్యకు ఇవ్వాలని చూస్తున్నాడు మెగా వారసుడు.
Published by: Praveen Kumar Vadla
First published: September 25, 2020, 9:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading