• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • MEGA POWER STAR RAM CHARAN FILM CAREER THIS YEAR HE ACT TWO FILM ACHARYA RRR ROUDRAM RANAM RUDHIRAM RELEASE SAME CALENDER YEAR TA

Ram Charan: ఇన్నేళ్ల కెరీర్‌లో రామ్ చరణ్ ఆ రికార్డు ఇప్పటికైనా అందుకుంటారా.. కరోనా బ్రేకులు వేస్తుందా.. ?

రామ్ చరణ్ (ram charan/Photo)

Mega Power Star Ram Charan: ఇన్నేళ్ల కెరీర్‌లో రామ్ చరణ్ ఆ రికార్డు ఇప్పటికైనా అందుకుంటారా.. వివరాల్లోకి వెళితే.. రామ్ చరణ్ విషయానికొస్తే..

  • Share this:
    Mega Power Star Ram Charan: ఇన్నేళ్ల కెరీర్‌లో రామ్ చరణ్ ఆ రికార్డు ఇప్పటికైనా అందుకుంటారా.. వివరాల్లోకి వెళితే.. రామ్ చరణ్ విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘చిరుత’ మూవీతో  టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్డాడు. ఆ తర్వాత ‘మగధీర’తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. 2007లో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రామ్ చరణ్..  ఆ తర్వాత ఒకే యేడాదిలో రెండు సినిమాలు మాత్రం రిలీజ్  చేసిన దాఖలాలు లేవు.  ఐతే.. రామ్ చరణ్ హీరోగా కెరీర్ మొదలు పెట్టాకా.. 2008, 2011,2020 కాలెండర్ ఇయర్స్‌లో రామ్ చరణ్ నటించిన సినిమాలేవి విడుదల కాలేదు. మరోవైపు 2017లో కూడా చరణ్ హీరోగా నటించిన సినిమా విడుదల కాలేదు. కానీ తన తండ్రి చిరంజీవి హీరోగా రామ్ చరణ్.. నిర్మిస్తూ తెరకెక్కించిన ‘ఖైదీ నెంబర్ 150’లో ఓ పాటలో అతిథి పాత్రలో మెరిసారు. ఇక 2019లో మాత్రం హీరోగా ‘వినయ విధేయ రామ’ సినిమాతో పలకరించారు. అదే యేడాది తన తండ్రి చిరంజీవి హీరోగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా నిర్మాతగా ఆడియన్స్‌ ముందుకు వచ్చారు.

    కానీ ఇప్పటి వరకు ఒకే కాలండర్ ఇయర్‌లో రెండు సినిమాలు విడుదల చేసిన దాఖలాలు మాత్రం లేవు. కానీ 2021లో మాత్రం రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు విడుదల అవుతాయని మెగాభిమానులు అనుకున్నారు. కానీ ఈ సారి కరోనా కారణంగా రామ్ చరణ్ ఒక క్యాలెండర్ ఇయర్‌లో రెండు సినిమాలు రిలీజ్ చేస్తారా అనే డౌట్స్ మాత్రం అభిమానుల్లో ఉన్నాయి. ముందుగా రామ్ చరణ్ .. తన తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తోన్న ‘ఆచార్య’ సినిమా కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాను ఆగష్టులో విడుదల చేయనున్నారు.

    ఒకే కాలండర్ ఇయర్‌లో విడుదల కానున్న ఆచార్య, ఆర్ఆర్ఆర్ (Twitter/Photo)


    మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ‌తో కలిసి నటిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ రౌద్రం రణం రుధిరం’ సినిమాను ఈ యేడాది అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కానీ ఈ సినిమా ఈ క్యాలండర్ ఇయర్‌లో రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. ఫిల్మ్ నగర్ వర్గాలు ప్రకారం ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఒక వేళ కరోనా కంట్రోల్‌లోకి వచ్చిన అంతా బాగుంటే.. ‘ఆచార్య’తో పాటు ‘ఆర్ఆర్ఆర్’ఇదే క్యాలండర్‌ ఇయర్‌లో విడుదలైన ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు.

    ఆచార్యలో రామ్ చరణ్ (Twitter/Photo)


    ముఖ్యంగా కొరటాల శివ దర్శకత్వంతో పాటు తండ్రి మెగాస్టార్‌ చిరంజీవితో పూర్తి స్థాయిలో నటించాలనే కోరిక కూడా ఈ సినిమాతో నెరవేరతుంది. మరోవైపు రామ్ చరణ్ తన కెరీర్‌లో మొదటిసారి ఓ డైరెక్టర్ దర్శకత్వంలో రెండోసారి నటిస్తున్నాడు. అది రాజమౌళి కావడం విశేషం. మొత్తంగా 2021 రామ్ చరణ్ ఫిల్మ్ కెరీర్‌లో వెరీ స్పెషల్ అని చెప్పాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: