రామ్ చరణ్ పెద్ద మనసు.. చనిపోయిన అభిమాని కుటుంబానికి ఆర్ధిక సాయం..

మెగా పవర్ స్టార్ రామ్  చరణ్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. సినిమాల్లోనే కాదు..నిజ జీవితంలో కష్టాల్లో ఉన్న ఓ అభిమాని కుటుంబాన్ని ఆదుకొని నిజమైన హీరో అనిపించుకున్నాడు. 

news18-telugu
Updated: December 9, 2019, 5:45 PM IST
రామ్ చరణ్ పెద్ద మనసు.. చనిపోయిన అభిమాని కుటుంబానికి ఆర్ధిక సాయం..
రామ్ చరణ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
మెగా పవర్ స్టార్ రామ్  చరణ్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. సినిమాల్లోనే కాదు..నిజ జీవితంలో కష్టాల్లో ఉన్న ఓ అభిమాని కుటుంబాన్ని ఆదుకొని నిజమైన హీరో అనిపించుకున్నాడు. డిసెంబర్ 8న ఆదివారం రోజున గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ అహ్మద్ ఆకస్మికంగా కన్నుమూయడంతో మెగా ఫ్యామిలీ హీరోలు విషాదంలో మునిగిపోయారు. తమను ఎంతగానో ఆరాధించే అభిమాని చనిపోయిన వార్త తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి హుటాహుటిన నూర్‌ అహ్మద్‌ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతేకాదు వారిని ఆర్ధికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మరోవైపు మెగా పవర్ స్టార్ షూటింగ్ నిమిత్తం  నిన్న హైదరాబాద్‌లో లేకపోవడంతో  వాళ్లింటికి వెళ్లలేకపోయారు. ఈ  రోజు హైదరాబాద్ వచ్చిన రామ్ చరణ్.. నూర్ అహ్మద్ కుటుంబానికి రూ. 10 లక్షల సాయం ప్రకటించారు. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. నూర్ అహ్మద్‌తో తమ మెగా ఫ్యామిలీకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Bad news for Mega Heroes and greater hyderabad mega fans president Noor Mohammad passed away pk హీరోలకు అభిమానులకు మధ్యలో ఏదో విడదీయరాని.. విడదీయలేని ఆత్మీయ అనుబంధం ఉంటుంది. దాన్ని ఎలా వర్ణించాలో కూడా భాష ఉండదు. అందుకే ఒకతల్లి కడుపున పుట్టకపోయినా కూడా అంతా.. mega family,mega fans,megastar,chiranjeevi,chiranjeevi fans,megastar fans,chiranjeevi fan noor mohammad died,telugu cinema,ala vaikuntapurramuloo teaser,అల వైకుంఠపురములో,అల వైకుంఠపురములో టీజర్,మెగా ఫ్యామిలీలో విషాదం,మెగా ఫ్యాన్స్‌కు విషాదం
మెగా హీరోలతో నూర్ మహమ్మద్


మా కుటుంబంలో ఎవరి పుట్టినరోజైన రక్తదాన శిబిరాలతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన నూర్ అహ్మద్  సేవలు వెలకట్టలేనవన్నారు. ఆయనలేని లోటు తీరనదంటూ తన ఆవేదన వెళ్లగక్కాడు. గతంలో ఒకసారి ఆయన హాస్పిటల్‌లో ఉన్నపుడు నేను స్వయంగా ఆ హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన మరణ వార్త మమ్మల్ని తీవ్రంగా  కలిచివేసిందన్నారు. అంతేకాదు మెగా బ్లడ్ బ్రదర్ నూర్ అహ్మద్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి కోరకుంటున్నానని రామ్ చరణ్ సంతాపం తెలిపారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 9, 2019, 5:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading