Ram Charan: ఇప్పుడు రాజమౌళిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈయన రామ్ చరణ్‌ను అంత త్వరగా వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. మరోవైపు రామ్ చరణ్ మాత్రం ప్రస్తుతం..
ఇప్పుడు రాజమౌళిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈయన రామ్ చరణ్‌ను అంత త్వరగా వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. మరోవైపు రామ్ చరణ్ మాత్రం ప్రస్తుతం తన తండ్రి సినిమాతో బిజీ అయిపోయాడు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న ఆచార్యలో కీలక పాత్ర చేస్తున్నాడు మెగా పవర్ స్టార్. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరుగుతుంది. అక్కడ బొగ్గు గనుల ప్రాంతంలో ఆచార్య షూటింగ్ జరుగుతుంది. మరో వారం రోజుల పాటు అక్కడే కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నాడు కొరటాల. ఇందులో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా ఉండాల్సిందే. మారేడుపల్లి నుంచి ఖమ్మంకు షూటింగ్ షిఫ్ట్ చేసాడు కొరటాల. అరగంటకు పైగానే ఉండే పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ అవుతాయని ముందు నుంచి చెప్తున్నాడు దర్శకుడు. పైగా ఈ చిత్రం 145 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది. పాన్ ఇండియన్ సినిమాలు పక్కనబెడితే సింగిల్ లాంగ్వేజ్‌లో అత్యధిక బిజినెస్ చేస్తున్న సినిమాగా ఆచార్య చరిత్ర తిరగరాస్తుంది. మే 13న సినిమా విడుదల కానుంది. మార్చ్ 15 తర్వాత ఆచార్య నుంచి ఫ్రీ అవ్వనున్నాడు రామ్ చరణ్. అక్కడ్నుంచి వచ్చిన తర్వాత ఏ మాత్రం బ్రేక్ తీసుకోకుండా వెంటనే ట్రిపుల్ ఆర్ లొకేషన్లో అడుగు పెట్టనున్నాడు మెగా పవర్ స్టార్.
‘ఆచార్య’ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ సీన్స్ లీక్ (Instagram/Photo)
ట్రిపుల్ ఆర్ షూటింగ్ ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో వేగంగా జరుగుతుంది. దీనికోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. అత్యున్నత టెక్నికల్ టీంతో క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతుంది. తారక్ ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. ఆచార్య నుంచి ఫ్రీ అవ్వగానే నేరుగా రామ్ చరణ్ వచ్చి ట్రిపుల్ ఆర్ సెట్లో అడుగు పెట్టనున్నాడు. ఆచార్య తర్వాత ఏ మాత్రం బ్రేక్ లేకుండా ఇక్కడికి రానున్నాడు చరణ్.
ఆర్ఆర్ఆర్ సినిమా (RRR movie)
పైగా దాదాపు 3 కోట్ల ఖర్చుతో భారీ సెట్ వేసి.. అందులోనే మార్చ్ మూడో వారం నుంచి రామ్ చరణ్, అలియా భట్‌పై ఓ రొమాంటిక్ పాటను చిత్రీకరించనున్నాడు రాజమౌళి. వారం రోజులకు పైగానే ఈ పాట చిత్రీకరణ జరగనుంది. మొత్తానికి అటు ఆచార్య.. ఇటు ట్రిపుల్ ఆర్తో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు మెగా పవర్ స్టార్.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.