Ram Charan: రామ్ చరణ్ ఖాతాలో మరో రికార్డు.. ఖుషీలో మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్..

రామ్ చరణ్ ఖాతాలో మరో రికార్డు (Twitter/Photo)

Ram Charan: రామ్ చరణ్ ఖాతాలో మరో రికార్డు.. ఖుషీ చేసుకుంుటన్నా  మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్. వివరాల్లోకి వెళితే.. 

  • Share this:
    Ram Charan: రామ్ చరణ్ ఖాతాలో మరో రికార్డు.. ఖుషీ చేసుకుంుటన్నా  మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్. వివరాల్లోకి వెళితే..  మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.  తొలి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రెండో సినిమా ‘మగధీర’తో టాలీవుడ్‌ రికార్డులన్నింటినీ తిరగరాసి మెగా ధీరుడు అనిపించుకున్నాడు. కెరీర్ మొదట్లో ఒక తరహా సినిమాలు చేసిన.. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ‘రంగస్థలం’ సినిమాతో నటుడిగా మరో మెట్టు పైకెక్కారు. అప్పటి వరకు రామ్ చరణ్ ముఖంగా ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఉండవవి చెప్పినవాళ్లే..  ఈ సినిమాలో నటుడిగా అద్భుతంగా నటించడాని విమర్శకులు ప్రశంసలు అందుకున్నారు.తాజాగా రామ్ చరణ్.. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రామ్ చరణ్‌ను ఫాలో అయ్యే వాళ్లు  4 మి లియన్స్‌కు (40 లక్షలు) చేరుకున్నారు. ఇక ట్విట్టర్‌లో రామ్ చరణ్‌ను 1.3 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు.

    ప్రస్తుతం తండ్రి చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ సినిమాలో ఆడియన్స్‌ను పలకరించనున్నారు. తొలిసారి తన తండ్రి చిరంజీవితో కలిసి పూర్తి స్థాయిలో నటిస్తుండంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ఎన్టీఆర్.. గొండు వీరుడు కొమరం భీమ్ పాత్రలో అలరించనున్నారు. ఆ తర్వాత శంకర్, లోకేష్ కనగరాజ్‌తో పాటు అనిల్ రావిపూడి వంటి దర్శకులతో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయడానికి రెడీ అవుతున్నారు.


    c
    ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగానే కాకుండా నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తండ్రితో వరుసగా సినిమాలు నిర్మిస్తున్నాడు. తండ్రి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్150’ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించారు రామ్ చరణ్. వివి వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.ఈ చిత్రంలో రామ్ చరణ్ అమ్మడు కుమ్ముడు అనే పాటలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చాడు. తండ్రి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్150’ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించాడు రామ్ చరణ్. వివి వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఖైదీ నంబర్ 150 తర్వాత తండ్రి మెగాస్టార్ చిరంజీవితో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని నిర్మించారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మగధీర’లో చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘బ్రూస్‌లీ’లో మరోసారి చిరంజీవి, రామ్ చరణ్ రెండో సారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇపుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’లో తొలిసారి పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: