హోమ్ /వార్తలు /సినిమా /

‘ఇస్మార్ట్ శంకర్’ కు రామ్ చరణ్ ఇస్మార్ట్ ప్రశంసలు..

‘ఇస్మార్ట్ శంకర్’ కు రామ్ చరణ్ ఇస్మార్ట్ ప్రశంసలు..

‘ఇస్మార్ట్ శంకర్’ను ప్రశంసించిన రామ్ చరణ్ (ఫేస్‌బుక్ ఫోటో)

‘ఇస్మార్ట్ శంకర్’ను ప్రశంసించిన రామ్ చరణ్ (ఫేస్‌బుక్ ఫోటో)

‘టెంపర్’ తర్వా త సరైన సక్సెస్‌లేని పూరీ జగన్నాథ్.. తాజాగా రామ్ హీరోగా తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. తాజాగా ఈ సినిమాను చూసి చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్,రామ్‌ను రామ్ చరణ్ ప్రశంసించాడు.

  ‘టెంపర్’ తర్వా త సరైన సక్సెస్‌లేని పూరీ జగన్నాథ్.. తాజాగా రామ్ హీరోగా తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. దాదాపు రూ.18 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా ..ఓవర్సీస్ తప్పించి.. మిగిలిన అన్ని ఏరియాల్లో లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ఇస్మార్ట్ శంకర్‌గా రామ్ నటనను అందరు మెచ్చుకుంటున్నారు. ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రముఖ హీరో రామ్ చరణ్ ఫేస్‌బుక్ వేదికగా ప్రశంసల ఝల్లు కురిపించాడు. అంతేకాదు దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో పాటు.. రామ్ నటనను మెచ్చుకుంటూ వాళ్లిద్దరు కలిసి ఉన్న ఫోటోను ఫేస్‌బుక్‌లో చెర్రీ పోస్ట్ చేసాడు.

  చరణ్  ప్రశంసలపై రామ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ధన్యవాదాలు సోదరా.. అని పోస్ట్ చేసాడు. ఇక హీరోగా రామ్ చరణ్.. పరిచయం అయింది కూడా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘చిరుత’ సినిమాతో అన్న విషయం తెలిసిందే కదా. ఆ తర్వాత రామ్ చరణ్, పూరీ జగన్నాథ్ కాంబినేసన్‌లో మరో సినిమా తెరకెక్కలేదు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Ismart Shankar, Ismart Shankar Movie Review, Nabha Natesh, Nidhhi Agerwal, Puri Jagannadh, Ram Charan, Ram Pothineni, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు