ఈ రోజు (మార్చి 27) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు (Ram Charan Birth day). ఈ సందర్భంగా ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు ఫ్యాన్స్. పలువురు సన్నిహితులు ప్రత్యేకంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ బెస్ట్ విషెస్ చెబుతున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ ఫస్ట్ లుక్ కూడా వదిలారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమాకు గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ఫిక్స్ చేసి మెగా అభిమానుల్లో జోష్ నింపారు. అదేవిధంగా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మరో మూవీ ‘మెగా పవర్’ (Mega Power) ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేశారు.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆశీస్సులతో సత్య ఆర్ట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం.1గా ‘మెగా పవర్’ మూవీ రూపొందుతోంది. ఇటీవల ప్రారంభమైన ఈ ‘మెగా పవర్’ చిత్రం ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేశారు. శ్రీ కల్యాణ్, శశి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి గేదెల రవిచంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. అడబాల నాగబాబు, సాయి నిర్మల, ఇల్లా అభిషేక్, సత్యమూర్తి గేదెల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని దర్శకులు మెహర్ రమేష్, కె.ఎస్ రవీంద్ర (బాబీ) ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ‘‘రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి గారి మీద ఫస్ట్ లుక్‌ను విడుదల చేశాం. మేం అడగ్గానే బిజీ షెడ్యూల్‌లో ఉన్నా మెహర్ రమేశ్, బాబీ మా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. చరణ్ పుట్టినరోజున మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. అలాగే మెగా ఫ్యామిలీ హీరోల సపోర్ట్‌తో ముందుకెళ్తున్నాం.
ఉగాది రోజున పూజా కార్యక్రమాలతో మొదలైన మా చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. మదర్ సెంటిమెంట్‌తో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. మెగా హీరోల అభిమానులు అందరి సపోర్ట్ మాకు ఉంటుందని ఆశిస్తున్నాం’’ అని అన్నారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ram Charan, Tollywood, Tollywood actor