మెగా లేడీస్ మేకప్ ఛాలెంజ్.. ఆడాళ్ల మజాకా..

మెగా ఫ్యామిలీ లేడీస్ ఛాలెంజ్ (Twitter/Photo)

కరోనా మహమ్మారి లాక్ డౌన్ కారణంగా సినీ ఇండస్ట్రీలో సినిమాలతో పాటు సీరియల్స్ షూటింగ్స్ అన్ని రద్దైయాయి. దీంతో సినీ ప్రముఖులంతా ఇంటికే పరిమితమైపోయారు. తాజాగా మెగా ఫ్యామిలీ లేడీస్ మేకప్ ఛాలెంజ్ స్వీకరించారు.

  • Share this:
    కరోనా మహమ్మారి లాక్ డౌన్ కారణంగా సినీ ఇండస్ట్రీలో సినిమాలతో పాటు సీరియల్స్ షూటింగ్స్ అన్ని రద్దైయాయి. దీంతో సినీ ప్రముఖులంతా ఇంటికే పరిమితమైపోయారు. దీంతో పాటు ఇంట్లో ఉంటున్న హీరోయిన్లు ఇపుడు మేకప్ ఛాలెంజ్ ఒకటి స్టార్ట్ చేసారు. ఇపుడీ చాలెంజ్ అన్ని ఇండస్ట్రీస్‌లో పాపులర్ అయింది. తాజాగా మెగా ఫ్యామిలీకి చెందిన లేడీస్ ఇపుడు మేకప్ చాలెంజ్‌లో పార్టిసిపేట్ చేసారు. ముందుగా చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఈ మేకప్ చాలెంజ్ ప్రారంభించింది. ఆ తర్వాత నిహారిక,చిరు చిన్న కూతురు శ్రీజతో పాటు అల్లు అర్జున్ భార్య స్నేహతో పాటు మిగిలిన మెగా ఫ్యామిలీకి చెందిన ఆడవాళ్లు ఇందులో పార్టిసిపేట్ చేసారు. వీళ్లందరు కలిసి చేసిన ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే మెగాస్టార్.. బీ ది రియల్ మేన్ చాలెంజ్‌లో భాగంగా ఇంట్లో పనులు చేసారు. ఈ సందర్భంగా చిరు ట్వీట్ చేస్తూ.. రోజూ ఇంట్లో నేను చేసే పనులను మరోసారి ఈ ఛాలెంజ్ కోసం చేసినట్టు ప్రకటించారు. మొత్తానికి మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలతో పాటు వాళ్ల లేడీస్ కూడా లాక్‌డౌన్ సందర్భంగా ఇంట్లో ఉంటూ రకరకాల చాలెంజ్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: