పవన్ పై విమర్శలు చేసి ఫలితం అనుభవిస్తున్న స్టార్ కమెడియన్..

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేదని ఎన్నికల ప్రచారంలో భాగంగా  ప్రముఖ కమెడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ఇపుడు ఆయన కెరీర్‌కు కొత్త కష్టాలు తీసుకొచ్చాయి. 

news18-telugu
Updated: June 18, 2019, 12:48 PM IST
పవన్ పై విమర్శలు చేసి ఫలితం అనుభవిస్తున్న స్టార్ కమెడియన్..
పవన్ కళ్యాణ్
  • Share this:
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేదని ఎన్నికల ప్రచారంలో భాగంగా  ప్రముఖ కమెడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ఇపుడు ఆయన కెరీర్‌కు కొత్త కష్టాలు తీసుకొచ్చాయి. టాలీవుడ్ కమెడియన్ పృధ్వీ ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ, జనసేన పార్టీలపై  తనదైన శైలిలో  దుమ్మెత్తిపోశారు. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ చాలా కామెంట్స్ చేశాడు పృథ్వీ. ముఖ్యంగా ప్రజలకు ఎవరు కావాలో ప్రజలు తేలుస్తారని అన్నాడు. అన్నట్టే ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున పోటీ చేసిన జనసేనాని రెండు సీట్లలో ఓడిపోవడాన్ని జనసేన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసిన పృథ్వీకి రాబోయే రోజుల్లో మెగా హీరోలు నటించే సినిమాల్లో అవకాశాలు రావడం కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి.

AP Politics 2019 : Actor 30 Years Pruthvi Shocking Comments on Janasena Chief Pawan Kalyan, ఇటీవలే పవన్  భీమవరం సభలో మాట్లాడుతూ.. తెలంగాణ ఏమైనా పాకిస్థానా ? అంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతుంది. ఇప్పటికే పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై పోసానితో పాటు చిన్నికృష్ణ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. బతాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్‌ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ తీవ్ర స్థాయిలో స్పందించారు.Andhra pradesh News,Andhra Pradesh Politics,Pawan kalyan,janasena Chief Pawan kalyan,Janasena Chief Pawan Kalyan 30 Years Pruthvi,Pawan Kalyan 30 Years Pruthvi,Pawan kalyan Comedian Pruthvi,Comedian 30 Years Pruthvi Sensational Comments On Pawan Kalyan,YCP Leader cum Actor Pruthvi Sensational Comments On janasena chief Pawan Kalyan,Pawan Kalyan Chinni Krishna 30 Years Comedian Pruthvi Pawan kalyan,Pawan Kalyan 30 years pruthvi Janasena TDP YSRCP YSP Chandrababu naidu YS Jagan,Tollywood News,Telugu Cinema,పవన్ కళ్యాణ్,జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ పృథ్వీ,పవన్ కళ్యాణ్ 30 ఇయర్స్ పృథ్వీ,పవన్ కళ్యాణ్ పై పృథ్వీ సంచలన వ్యాఖ్యలు,జనసేనాని పవన్ కళ్యాణ్ పై 30 ఇయర్స్ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,
వైసీపీ నేత పృథ్వీ


తాజాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాలో పృధ్వీ కోసం ఓ రోల్ అనుకున్నాడు మాటల మాంత్రికుడు. ఐతే అల్లు అర్జున్ మాత్రం దీన్ని వ్యతిరేకించడంతో పృధ్వీకి బదులుగా మరో కమెడియన్ ని రంగంలోకి దించబోతున్నాడట దర్శకుడు త్రివిక్రమ్.  వైఎస్సార్ సీపీ తరఫున ప్రచారం చేసిన జీవిత రాజశేఖర్, అలీ లాంటి వాళ్లు లౌక్యంగా ప్రచారంలో పాల్గొంటే..మెగాఫ్యామిలీ పై అనవసర విమర్శలు చేసిన పృథ్వీ ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాట్టు అందరు మాట్లాడుకుంటున్నారు. పృధ్వీ నోటికొచ్చినట్లు మాట్లాడడం మెగాహీరోలను చాలానే బాధ పెట్టిందట. ఆ కారణంగానే ఇప్పుడు తమ సినిమాల్లో పృధ్వీకి అవకాశాలు ఇవ్వకుండా అనధికార నిషేధం విధించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

First published: June 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు