Mega Heroes : మెగా హీరోలెవరికి కలిసిరాని ఆ సెంటిమెంట్.. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ సహా..

మెగా హీరోలకు కలిసిరాని సెంటిమెంట్ (Twitter/Photo)

Mega Heroes : మెగా హీరోలెవరికి కలిసిరాని ఆ సెంటిమెంట్.. చిరంజీవి (Megastar Chiranjeevi), రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun) సహా అందరు కథానాయకులకు ఈ సెంటిమెంట్‌కు బలయ్యారు.

 • Share this:
  Mega Heroes : మెగా హీరోలెవరికి కలిసిరాని ఆ సెంటిమెంట్.. చిరంజీవి (Megastar Chiranjeevi), రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun) సహా అందరు కథానాయకులకు ఈ సెంటిమెంట్‌కు బలయ్యారు. వివరాల్లోకి వెళితే.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా అన్ని సినిమాల విడుదల తేదిలు వాయిదాలు పడ్డాయి. అందులో చిరంజీవికి చెందిన మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల రిలీజ్ డేట్స్ కూడా ఉన్నాయి. ముందుగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’ సినిమాను మే 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అటు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాను ఆగష్టు 13న రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. ఇక రామ్ చరణ్ హీరోగా ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను కూడా అక్టోబర్ 13న దసరా కానుకంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఒకవేళ అంతా బాగుంటే.. ఈ పాటికి ఈ మూవీ విడుదలై రెండో రోజు అయివుండేది.

  ఐతే.. ఇందులో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాను డిసెంబర్ 17న క్రిస్మక్ కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి శ్రీవల్లి సాంగ్ విడుదల చేసారు. ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్.. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మారారు. ఈ  సినిమాను  ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది.  ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది.

  Chiranjeevi - Mani Sharma: ఆచార్య సహా చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

  ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను వచ్చే యేడాది జనవరి 7న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాపై సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా కోసం అపుడే ఎన్టీఆర్, రామ్ చరణ్ డబ్బింగ్ పనులు పూర్తి చేసారు. పైగా ఎన్టీఆర్ మలయాళం తప్ప అన్ని భాషల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పినట్టు సమాచారం. అటు రామ్ చరణ్ కూడా మలయాళం, కన్నడ తప్పించి మిగతా మూడు భాషల్లో తన క్యారెక్టర్‌కు సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేసినట్టు సమాచారం.

  ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న టాప్ 15 బాలీవుడ్ హీరోయిన్స్..

  అటు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఆచార్య సినిమాను కూడా ముందుగా మే 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మెగా హీరోల్లో 13వ తేదిన అందరి కంటే ముందు రావాల్సిన ఈ సినిమా వచ్చే యేడాది ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తంగా 13 తేదిన విడుదల తేదిలు అనౌన్స్ చేసినా.. మెగా హీరోలెవరు ఆ డేట్‌లో తమ సినిమాలను విడుదల చేయలేకపోవడం విశేషం. మొత్తంగా మెగా హీరోలైన చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ సహా అందరికీ 13వ తేది అచ్చిరాలేదని మెగాభిమానులు తెగ ఫీలవుతున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: