సాయి పల్లవిని పెళ్లాడుతానంటున్న వరుణ్ తేజ్..

మెగా హీరో వరుణ్ తేజ్ సాయి పల్లవిని పెళ్లాడుతానంటున్నాడు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: September 23, 2019, 3:44 PM IST
సాయి పల్లవిని పెళ్లాడుతానంటున్న వరుణ్ తేజ్..
వరుణ్ తేజ్,సాయి పల్లవి (File Photos)
news18-telugu
Updated: September 23, 2019, 3:44 PM IST
మెగా హీరో వరుణ్ తేజ్ సాయి పల్లవిని పెళ్లాడుతానంటున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఈ ఇయర్ సీనియర్ హీరో వెంకటేష్‌తో కలిసి చేసిన ‘ఎఫ్2’తో మంచి విజయాన్ని అందుకున్నాడు వరుణ్ తేజ్. రీసెంట్‌గా హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసిన ‘వాల్మీకి’ అదేనండి ‘గద్దలకొండ గణేష్’గా 'సినిమాలో టైటిల్ పాత్రలో అదరగొట్టాడు.ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ తేజ్ నటనను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. తొలి నుంచి సినిమా సినిమాకు డిఫరెంట్ పాత్రలు చేసుకుంటూ వెళుతున్న వరుణ్ తేజ్.. ‘గద్దలకొండ గణేష్’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ Voot అనే డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో వరుణ్ తేజ్‌ను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్.. పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ..వరుణ్ తేజ్ ఇప్పటి వరకు నటించిన హీరోయిన్స్ గురించి అడగగా.. వరుణ్.. ఒక్కో కథానాయిక గురించి అదిరిపోయే ఆన్సర్స్ ఇచ్చాడు. అందులో ముఖ్యంగా అవకాశమోస్తే.. సాయి పల్లవిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. మరోవైపు ఛాన్స్ వస్తే పూజా హెగ్డేతో  డేటింగ్ చేస్తానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు అవకాశమొస్తే.. రాశిఖన్నాను చంపేయాలనుంది అంటూ చాలా జోవియల్‌గా సమాధానం చెప్పాడు. ఏమైనా ‘ఫిదా’ సినిమాలో తనతో నటించిన సాయి పల్లవికి వరుణ్ తేజ్ నిజంగానే ఫిదా అయినట్టు ఈ ఇంటర్వ్యూ బట్టి చెప్పొచ్చు.

 

First published: September 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...