తెలుగు ఇండస్ట్రీలో రాక్ స్టార్ అనే పదం కేవలం దేవీ శ్రీ ప్రసాద్ కోసమే పుట్టిందేమో అనేట్లుగా ఈయన దుమ్ము లేపేస్తున్నాడు. ఒకటి రెండు కాదు.. 22 ఏళ్లుగా ఈయన పాటలు తెలుగు ప్రేక్షకులతో పాటు సౌత్, నార్త్ ఆడియన్స్‌ను కూడా అలరిస్తున్నాయి. మొన్నటికి మొన్న పుష్ప పాటలతో సంచలనం సృష్టించాడు డిఎస్పీ. ఈయన పేరు పోస్టర్‌పై కనిపిస్తే సినిమాను ఎక్స్ ట్రా మైలేజ్ వస్తుందని నమ్మే దర్శకులు కూడా ఉన్నారు మన దగ్గర. అలాగే దేవీ పాటలతో హిట్టైన సినిమాలు కూడా ఉన్నాయి. అందుకే హిట్లు ఫ్లాపులతో పనిలేకుండా దేవీ పాటలు బాగానే మార్మోగుతుంటాయి.
అందుకే పోస్టర్స్‌పై కూడా రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అని వేసుకుంటాడు ఈయన. అయితే ఇప్పుడు ఈ రాక్ స్టార్ బిరుదుకు ఎసరు వచ్చేలా కనిపిస్తుంది. ఈయన్ని కాదని మరొకర్ని రాక్ స్టార్ అంటే అభిమానులు కూడా ఒప్పుకోరు. కానీ వరుణ్ తేజ్ మాత్రం అదే చేసాడిప్పుడు. విజయవాడలో గని సినిమా మూడో పాటను విడుదల చేసారు. అక్కడ కెఎల్ యూనివర్సిటీలో కాలేజీ విద్యార్థినులతో ఈ పాటను విడుదల చేయించారు. రోమియోకు జూలియట్టులా అంటూ సాగే ఈ పాటను శంకర్ కూతురు అదితి పాడటం గమనార్హం.
Oh man The Man, DSP title ke yesaru pettaru ga #Ghani pic.twitter.com/pglMzfJMJn
— Naveen KrishnamRaju (@NaveenKRaju22) February 8, 2022
ఈ పాట విడుదల సందర్భంగా మాట్లాడుతూ.. రాక్ స్టార్ థమన్ అంటూ పొగిడేసాడు వరుణ్ తేజ్. దాంతో ఏంది బ్రో అంత మాట అనేసావ్ అంటూ పక్కనే ఉన్న థమన్ ఉలిక్కి పడ్డాడు. దాంతో వరుణ్ తేజ్ కూడా కవర్ చేసాడు. మ్యూజిక్ బాగా కొట్టే ఎవడైనా రాక్ స్టారే అంటూ చెప్పుకొచ్చాడు వరుణ్. అయితే థమన్ మాత్రం తాను రాక్ స్టార్ కాదంటూ తెలిపాడు. నిజానికి దేవి, థమన్ మంచి స్నేహితులు కూడా. ఇద్దరి మధ్య హెల్తీ కాంపిటీషన్ ఎప్పుడూ ఉంటుందని చెప్తుంటారు. ఈయన సినిమాలకు ఆయన.. ఆయన సినిమాలకు ఈయన ఎప్పుడూ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పుకుంటారు.
My love for #GhaniMusic is here !! #Ghani #RomeoJuliet ?????????
— thaman S (@MusicThaman) February 8, 2022
Enjoy !! It feels like #ValentinesDay has come little early ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️@AditiShankarofl U have a long Way ???? thank U ?@IAmVarunTej @RenaissanceMovi ??https://t.co/8s3Ux6BHjY
ఈ మధ్య కాలంలో దేవి కంటే కాస్త పైనే ఉన్నాడు థమన్. ముఖ్యంగా అఖండ లాంటి సినిమాలు థమన్ రేంజ్ పెంచేసాయి. మరోవైపు దేవీ కూడా పుష్పతో ఫామ్‌లోకి వచ్చాడు. 2022లో వరస సినిమాలతో వచ్చేస్తున్నాడు డిఎస్పీ. థమన్ కూడా తక్కువేం తినలేదు. ఈయన చేతిలో డజన్ సినిమాలున్నాయి. అయితే ఎన్ని సినిమాలు చేసినా కూడా.. థమన్ ఎప్పటికీ రాక్ స్టార్ కాలేడు అంటూ దేవి అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు వరుణ్ తేజ్ మాత్రం తెలిసి అన్నాడో.. కావాలనే అన్నాడో తెలియదు కానీ కొత్త చర్చకు మాత్రం తెర తీసాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.