ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి దూసుకొచ్చిన యువ హీరో పంజా వైష్ణవ్ తేజ్. మెగా కుటుంబం నుంచి వచ్చిన పదో హీరో ఈయన. మొదటి సినిమాతో సంచలన విజయం అందుకుని అందరి దృష్టిలో పడ్డాడు వైష్ణవ్ తేజ్. బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఉప్పెన సినిమా ఏకంగా 51 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ చిత్రంతోనే పరిచయమైన కృతి శెట్టి ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిపోయింది. మరోవైపు వైష్ణవ్ తేజ్ కూడా వరస సినిమాలు చేస్తున్నాడు. గతేడాది క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కొండపొలంతో అంచనాలు అందుకోలేకపోయాడు ఈయన. మంచి అంచనాలతోనే వచ్చిన కొండ పొలం దారుణంగా డిజాస్టర్ అయింది. దాంతో మూడో సినిమా కోసం భారీ గ్యాప్ తీసుకుంటున్నాడు ఈయన.
తెలుగులో ఇంతమంది దర్శకులున్నా కూడా ఇప్పుడు ఓ తమిళ దర్శకుడితో సినిమాను ప్రకటించాడు. దీనిపై ఇదివరకే క్లారిటీ వచ్చినా కూడా జనవరి 24న కొత్త సినిమా టైటిల్ టీజర్ విడుదల చేసారు. రంగరంగ వైభవంగా అంటూ వచ్చేస్తున్నాడు మెగా మేనల్లుడు. అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ చేసిన గిరీశయ్య దీనికి దర్శకుడు. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను SVCC బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు.
రొమాంటిక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ కేతిక శర్మ ఇందులో వైష్ణవ్ తేజ్‌తో రొమాన్స్ చేయబోతుంది. తాజాగా విడుదలైన టైటిల్ టీజర్ కూడా చాలా రొమాంటిక్‌గా ఉంది. బటర్ ఫ్లై కిస్ కావాలా అంటూ హీరో హీరోయిన్ల మధ్య మంచి రొమాంటిక్ టీజర్ కట్ చేసారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
Get Ready for a Romantic Entertainer❤️#PanjaVaisshnavTej & #Ketikasharma in a brand new love story #RangaRangaVaibhavanga ?
▶️ https://t.co/ApzJzBorwl
A Rockstar @ThisIsDSP Musical?
Directed by @GIREESAAYA#RRVTitleLaunch #RRVTheFilm@SVCCofficial @BvsnP pic.twitter.com/s6JpwRsWBl
— SVCC (@SVCCofficial) January 24, 2022
యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా వస్తుంది. టైటిల్ టీజర్ చూస్తుంటేనే ఈ విషయం అర్థమైపోతుంది. ఈ సినిమా కోసం వైష్ణవ్ తేజ్ తనను తాను చాలా మార్చుకున్నాడు. లుక్ పరంగా కూడా కొత్తగా కనిపిస్తున్నాడు. మొదటి రెండు సినిమాలతో పోలిస్తే.. రంగరంగ వైభవంగా కోసం మరింత స్టైలిష్‌గా మారిపోయాడు ఈ హీరో. కొండపొలం అంచనాలు తప్పినా.. మూడో సినిమాతో కచ్చితంగా ఫామ్‌లోకి వస్తానని ధీమాగా చెప్తున్నాడు వైష్ణవ్ తేజ్. మరి ఈయన నమ్మకాన్ని తమిళ దర్శకుడు గిరీశయ్య ఎంతవరకు నిలబెడతాడో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ketika sharma, Telugu Cinema, Tollywood, Vaishnav tej