గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచేస్తున్నాయి. అక్కడా ఇక్కడా కొన్ని ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఈ వరదలతో ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే సినిమా వాళ్లకు కూడా వర్షాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇన్ని రోజులు కరోనా కారణంగా షూటింగ్స్ జరగలేదు. ఇప్పుడు కరోనా ఉన్నా కూడా ధైర్యంగా ముందడుగు వేస్తే వర్షాలు అడ్డు తగులుతున్నాయి. తాజాగా మెగా హీరో వైష్ణవ్ తేజ్ సినిమాకు కూడా ఇదే జరిగింది. ఈయన తొలి సినిమా ఉప్పెన ఇంకా విడుదల కాలేదు.
వైష్ణవ్ తేజ్ (vaishnav tej)
అప్పుడే రెండో సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకుడు. ఓ వైపు పవన్ కళ్యాణ్ సినిమాను డైరెక్ట్ చేస్తూనే.. అది గ్యాప్ ఇచ్చి మరో మెగా హీరోతో సినిమా పూర్తి చేయాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా అటవీ ప్రాంతంలోనే జరుగుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో హీరోయిన్. ఓ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను పూర్తిగా వికారాబాద్ అటవీ నేపథ్యంలో తెరకెక్కించాలని ప్లాన్ చేసాడు క్రిష్. దానికి తగ్గట్లుగానే 40 రోజుల సింగిల్ షెడ్యూల్ ప్లాన్ చేసాడు.
క్రిష్ వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ సింగ్ (rakul vashnav tej krish)
అలాగే షూటింగ్ కూడా చేస్తున్నాడు. అయితే అన్నీ బాగానే జరుగుతున్నా మధ్యలో రకుల్ డ్రగ్స్ కేసు కాస్త ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు వర్షాలు ముంచేస్తున్నాయి. వీళ్ల ప్లాన్స్‌ను వర్షం పూర్తిగా దెబ్బతీసింది. వికారాబాద్ అటవీ ప్రాంతంలో రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. కానీ ఇప్పుడు అనంతగిరి కొండలతో పాటు వికారాబాద్ పరిసర ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు ఆటంకం కలుగుతుంది. షూటింగ్ స్పాట్‌ను వరద నీరు ముంచెత్తడంతో షూటింగ్‌కు ప్యాకప్ చెప్పేసారు దర్శక నిర్మాతలు. అంతా ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు. వర్షాలు తగ్గిన తర్వాత మళ్లీ కొత్త షెడ్యూల్ మొదలు పెట్టనున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.