Home /News /movies /

MEGA HERO SAITEJ DOING A CAMEO IN PAN INDIA MOVIE AHAM BRAMHASMI MHN

Manchu Manoj: మంచు మ‌నోజ్ చిత్రంలో మెగా హీరో.. కార‌ణ‌మదేనా?

Mega hero Saitej doing a cameo in pan india movie Aham Bramhasmi

Mega hero Saitej doing a cameo in pan india movie Aham Bramhasmi

Manchu Manoj: మంచు మనోజ్ హీరోగా, నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రంలో సాయితేజ్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి

    ద‌క్షిణాది అందులో ముఖ్యంగా టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాల తాకిడి ఎక్కువైంది. బాహుబ‌లి, కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 1 ప్ర‌భావ‌మో ఏమో కానీ.. తెలుగు నుంచి ఓ మోస్త‌రు క్రేజ్ ఉన్న హీరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు మ‌రి. స‌క్సెస్, ఫెయిల్యూర్‌ను ప‌క్క‌న పెడితే ఇప్ప‌టికే కొంత మంది టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా సినిమాల‌తో సంద‌డి చేయ‌గా.. మ‌రికొంద‌రు సంద‌డి చేయ‌డానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా సిద్ధంగా ఉన్న హీరోల లిస్టులో మంచు మ‌నోజ్ కూడా ఉన్నాడు. మంచు మ‌నోజ్ హీరోగా న‌టిస్తూ త‌న సొంత బ్యాన‌ర్‌పై రూపొందిస్తోన్న చిత్రం ‘అహం బ్ర‌హ్మాస్మి’. శ్రీకాంత్ రెడ్డి ద‌ర్శ‌కుడు. ప్రియా భ‌వానీ శంక‌ర్ హీరోయిన్‌.

    కరోనా ప్ర‌భావంతో ఆగిన ఈ సినిమా షూటింగ్ మ‌ళ్లీ సెట్స్ పైకి వెళ్లింది. అయితే ఇండ‌స్ట్రీలో వినిపిస్తోన్న గుస‌గుస‌ల ప్ర‌కారం ఈ సినిమాలో క‌థ‌ను మ‌లుపు తిప్పే ఓ కీల‌క పాత్ర ఉంద‌ట‌. ఆ పాత్ర‌లో ఎవ‌రిని న‌టింప చేయాలా? అనే దానిపై మ‌నోజ్ చాలానే యోచించాడ‌ట‌. ఎట్ట‌కేల‌కు త‌న స్నేహితుడు సాయితేజ్‌ను సంప్ర‌దించి, స‌ద‌రు గెస్ట్ రోల్‌లో న‌టించాల‌ని కోర‌గానే, సాయితేజ్ కూడా స్నేహ‌ధ‌ర్మం కోసం న‌టిస్తున్నాన‌ని చెప్పిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

    అహం వ‌ల్ల మ‌నిషి జీవితంలో ఎలాంటి ప‌రిణామాలు జ‌రిగాయ‌నే క‌థాంశంతో రూపొందుతోన్న చిత్ర‌మే ‘అహం బ్ర‌హ్మాస్మి’. రీసెంట్‌గా మ‌నోజ్ అన్న‌య్య‌.. విష్ణు మంచు చేసిన పాన్ ఇండియా మూవీ మోస‌గాళ్లు బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిలప‌డ్డ సంగ‌తి తెలిసిందే. మ‌రి అన్న‌య్య‌కు ఎదురైన ఫ‌లితాన్ని దృష్టిలో పెట్టుకుని మ‌నోజ్ ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటాడ‌నేది ఆలోచించాల్సిన విష‌యం.
    Published by:Anil
    First published:

    Tags: Aham Brahmasmi, Manchu Manoj

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు