Syeraa : 'సైరా' టాక్‌పై సాయిధరమ్ తేజ్.. జోష్ మామూలుగా లేదుగా..

Syeraa Narasimha Reddy : ఓవర్‌సీస్ రివ్యూలు కూడా పాజిటివ్‌గా ఉండటం.. చిరు నటన అద్భుతంగా ఉందన్న ప్రశంసలు వినిపిస్తుండటంతో.. సైరాపై మరింత ఎటెన్షన్ క్రియేట్ అయింది.

news18-telugu
Updated: October 2, 2019, 8:23 AM IST
Syeraa : 'సైరా' టాక్‌పై సాయిధరమ్ తేజ్.. జోష్ మామూలుగా లేదుగా..
చిరంజీవి, హీరో సాయిధరమ్ తేజ్ (File Photos)
news18-telugu
Updated: October 2, 2019, 8:23 AM IST
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం 'సైరా నరసింహారెడ్డి' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రపంచవ్యాప్తంగా సుమారు 4620 థియేటర్లలో సైరా విడుదలైంది. సైరా విడుదల నేపథ్యంలో.. సినిమా రిజల్ట్ గురించి అభిమానులు అప్పుడే సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.ట్విట్టర్‌లో ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. చిరు అభిమానులు బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ట్విట్టర్‌ను హోరెత్తిస్తున్నారు.ఓవర్‌సీస్ రివ్యూలు కూడా పాజిటివ్‌గా ఉండటం.. చిరు నటన అద్భుతంగా ఉందన్న ప్రశంసలు వినిపిస్తుండటంతో.. సైరాపై మరింత ఎటెన్షన్ క్రియేట్ అయింది. చిరు మేనల్లుడు,హీరో సాయిధరమ్ తేజ్ కూడా సైరాపై ట్వీట్ చేశారు.సైరా బ్లాక్ బస్టర్ అంటూ ట్వీట్ చేసిన సాయిధరమ్.. పార్టీ ఎప్పుడు ఎక్కడ? అంటూ జోష్‌గా ప్రశ్నించారు. మొత్తం మీద సైరా పాజిటివ్ టాక్‌తో మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్‌లో హుషారు రెట్టింపయ్యింది.





First published: October 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...