మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. శుక్రవారం సాయి తేజ్ ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ బైక్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గరంలోని కేబుల్ బ్రిడ్జ్-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయితేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టుగా సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్‌తేజ్‌ను 108 సాయంతో సమీపంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. సాయిధరమ్ తేజ్ కుడికన్ను, ఛాతి భాగంలో తీవ్రగాయాలు అయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో హెల్మెట్ ఉన్నప్పటికీ సాయిధరమ్ తేజ్‌కు తీవ్ర గాయాలు అయినట్టుగా తెలుస్తోంది.
ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు మాట్లాడుతూ.. బైక్‌పై వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. బైక్‌ను నియంత్రించలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పారు. ఇందుకు సంబంధించి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసినట్టుగా చెప్పారు.
అయితే సాయి ధరమ్ తేజ్‌కు ఈ ప్రమాదంలో దెబ్బలు బాగా తగిలినట్టుగా తెలుస్తుంది. బైక్‌పై నుంచి కిందపడిన వెంటనే ఆయన కాసేపు కోమాలోకి వెళ్లారు. ఈ ఘటన మెగా ఫ్యామిలీతో పాటుగా అభిమానులను, సినీ ప్రేమికులను తీవ్ర కలవరానికి గురిచేసింది. అయితే ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ బాగానే ఉన్నట్టుగా ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
Official Communication - @IamSaiDharamTej is absolutely fine and recovering. Nothing to worry. He is under precautionary care in hospital.
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) September 10, 2021
ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఇప్పటికే జనసేన అధినేత స్పత్రికి చేరుకుని సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, నిహారిక, సందీప్ కిషన్‌లు ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే సాయి ధరమ్ తేజ్ పరిస్థితి ఎలా ఉందనే దానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Road accident, Sai Dharam Tej