టాలీవుడ్ మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్.. హీరో ప్రభాస్‌కు సోషల్ మీడియా వేదికగా సారీ చెప్పడం హాట్ టాపిక్ మారింది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పెళ్లిల సీజన్ నడుస్తోంది. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు అనే తేడా అందరు ఏడడుగుల బంధంతో మూడు ముళ్లతో ఒకటవుతున్నారు. ఇప్పటికే నిర్మాత దిల్ రాజుతో పాటు హీరో నిఖిల్, నితిన్, జబర్ధస్త్ కమెడియన్ మహేష్‌తో రీసెంట్గా టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా తన గర్ల్ ఫ్రెండ్ మిహీకా బజాజ్‌ను అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. ఇపుడు మెగా డాటర్ నిహారిక త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. ఇప్పటికే నిహారిక నిశ్చితార్ధం జరిగింది. పెళ్లి డేట్ త్వరలో అనౌన్స్ చేయనున్నారు. తాజాగా పెళ్లి పీఠలు ఎక్కనున్న సెలబ్రిటీల లిస్టులో సాయి ధరమ్ తేజ్ కూడా చేరాడు.
ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి....
More details tomorrow at 10AM pic.twitter.com/5PJZIPuVJu
— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 23, 2020
తాజాగా సాయి ధరమ్ తేజ్.. తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ పోస్ట్ చేసాడు. ఒక్కోసారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైమ్ వచ్చినపుడు మరి.. అంటూ సింగిల్స్ ఆర్మీ వాట్సాఫ్ గ్రూప్‌లో ప్రభాస్‌కు సారీ చెప్పి సాయి ధరమ్ తేజ్.. ఈ గ్రూపు నుండి వైదొలిగాడు. అసలు విషయం తెలియాలంటే.. రేపు ఉదయం 10 గంటల వరకు వెయిట్ చేయాల్సిందే అని చెప్పాడు. సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చూస్తుంటే..తన పెళ్లికి సంబంధించిన విషయాన్ని చెప్పబోతున్నట్టు స్పష్టమైంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్.. ‘సోలో బ్రతుకు సో బెటర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇదే బ్యాచిలర్‌గా సాయి ధరమ్ తేజ్ లాస్ట్ మూవీ అనే చెప్పాలి. ఈ సినిమా త్వరలో ఓటీటీలో విడుదల కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Prabhas, Sai Dharam Tej, Tollywood