తెలుగు సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే, ఆ మార్గంలో వెళ్తున్న హీరో సాయిధరమ్ తేజ్ అతడిని ఆస్పత్రిలో చేర్పించాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. హైదరాబాద్ నానక్‌రాం గూడ నుంచి షూటింగ్ పూర్తి చేసుకుని కారులో వెళ్తున్న సాయి ధరమ్ తేజ్‌కు.. మార్గమధ్యంలో జూబ్లిహిల్స్ వద్ద ఓ రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఓ బైక్ అదుపుతప్పి కారును ఢీకొంది. తన కారును పక్కన ఆపి అక్కడకు వెళ్లి చూసిన సాయి ధరమ్ తేజ్ అవాక్కయ్యాడు. అక్కడ గాయపడిన వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్ అచ్చుగా గుర్తించాడు. వెంటనే అతడిని తన కారులో సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించాడు. మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు కాలుకి గాయాలయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.