మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఎంత కష్టపడుతున్న, మంచి హిట్ మాత్రం దక్కట్లేదు. ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతంతమాత్రమే. దీంతో తేజు తన నెక్ట్స్ సినిమా ‘చిత్రలహరి’పై బాగానే ఆశలు పెట్టుకొన్నాడు. అంతేకాకుండా కసితో పనిచేస్తున్నాడు. అయితే ఆయన సినిమాలు తెలుగులో పెద్దగా ఆడనప్పటికీ.. హిందీలో ఊపేస్తున్నాయి. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో అదరగోడుతున్నాయ్.
తేజ్ హిందీలో డబ్ అయిన సినిమాలు.. 'రేయ్', 'సుప్రీం', 'జవాన్', ఇటీవల విడుదలైన 'తేజ్ ఐలవ్ యూ' సినిమాలు యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌ను రాబడుతున్నాయి. ఈ సినిమాలలోని కంటెంట్ తెలుగువారికి నచ్చకపోయిన.. హింది ప్రేక్షకులను అలరిస్తుంది. దీంతో తేజ్ సినిమాలకు వ్యూస్ అదిరిపోతున్నాయి. ఆయన సినిమాలకు సంబంధించిన వ్యూస్ చూస్తే..‘రేయ్’ సినిమాకు 9.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.. 'సుప్రీం' సినిమాకు 27 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ‘జవాన్’ సినిమా 38 మిలియన్ల వ్యూస్‌ను పొందింది. తేజ్ లెటెస్ట్ సినిమా 'తేజ్ ఐ లవ్ యూ' 37 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది.
Photos: పెళ్లిచూపులు బ్యూటీ రితూవర్మ లేటెస్ట్ ఫోటోస్..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sai Dharam Tej