MEGA HERO SAI DHARAM TEJ BIKE RIDING PHOTOS IN HYDERABAD STREETS GOING VIRAL IN SOCIAL MEDIA PK
Sai Dharam Tej: భాగ్యనగర వీధుల్లో మెగా హీరో బైక్ రైడింగ్.. ఫోటోలు వైరల్..
సాయి ధరమ్ తేజ్ బైక్ రైడింగ్ (Sai Dharam Tej)
Sai Dharam Tej: సాధారణంగా హీరోలు బయటికి రావాలంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. గుర్తింపు ఉన్న హీరోలు బయటికి వస్తేనే మీద పడిపోతుంటారు అభిమానులు. అలాంటిది స్టార్ హీరోలు వస్తే ఇంకేమైనా ఉందా..?
సాధారణంగా హీరోలు బయటికి రావాలంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. గుర్తింపు ఉన్న హీరోలు బయటికి వస్తేనే మీద పడిపోతుంటారు అభిమానులు. అలాంటిది స్టార్ హీరోలు వస్తే ఇంకేమైనా ఉందా..? వాళ్లకు బాడీగార్డులు వెంట ఉండాల్సిందే. అలాంటిది ఓ స్టార్ హీరో వీధుల్లో బైక్ వేసుకుని తిరిగే వీలుందా..? అసలు అది సాధ్యమయ్యే పనేనా..? దాన్ని చేసి చూపించాడు ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఈయన హైదరాబాద్ వీధుల్లో బైక్ రైడింగ్ చేసాడు. నిజానికి తమిళ సూపర్ స్టార్ అజిత్ సైకిల్, బైక్‌పై ఇప్పటికే హైదరాబాద్‌లో రైడింగ్ చేసాడు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో సందడి చేసాయి. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కూడా హైదరాబాద్ రోడ్లపై బైక్‌పై సందడి చేసాడు. ఈ ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ముంబై రోడ్లపై కాస్ట్లీ బైక్ RRపై రైడ్ చేసాడు. అదంటే ముంబై.. ఎవరూ పెద్దగా గుర్తు పట్టరు. కానీ ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ వీధుల్లోనే ఇలా చేసాడు సాయి. లక్షలు విలువ చేసే లగ్జరీ బైక్‌పై హైదరాబాద్ వీధుల్లోనూ సందడి చేసాడు. జూబ్లీ హిల్స్ నుంచి మాదాపూర్ వరకు బైక్ రైడింగ్ చేసి సందడి చేసాడు ఈయన. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తనను ఎవరూ గుర్తు పట్టకుండా ట్రాక్ సూట్‌తో పాటు హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు సాయి. దాంతో ఈయన పక్కనుంచే వెళ్తున్నా కూడా ఎవరూ గుర్తు పట్టలేరు.
సాయి తేజ్ రిపబ్లిక్ (Sai Tej Republic release date)
ఇదిలా ఉంటే ఈయన ప్రస్తుతం విలక్షణ దర్శకుడు దేవా కట్టా తెరకెక్కిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ రిపబ్లిక్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్గా నటిస్తుండగా.. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తుంది. సీనియర్ నిర్మాతలు జె. పుల్లారావు, భగవాన్ నిర్మిస్తున్నారు. జూన్ 4న ఈ సినిమా విడుదల కానుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.