హోమ్ /వార్తలు /సినిమా /

Allu Arjun: మెగా హీరో ఎంట్రీ.. బన్నీకి సారీ... ఫ్యాన్స్ కూల్ అవుతారా ?

Allu Arjun: మెగా హీరో ఎంట్రీ.. బన్నీకి సారీ... ఫ్యాన్స్ కూల్ అవుతారా ?

అల్లు అర్జున్ పుష్ప Photo : Twitter

అల్లు అర్జున్ పుష్ప Photo : Twitter

గత కొన్ని రోజులుగా బన్నీ ఫ్యాన్స్, మెగా అభిమానుల మధ్య ట్విట్టర్ వేదికగా వాడి వేడిగా మాటల యుద్ధం జరుగుతోంది. దీంతో ఈ మ్యాటర్‌లోకి మెగా హీరో ఎంట్రీ అయినట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్(Allu Arjun) అభిమానులు, మెగా అభిమానులకు మధ్య ట్విట్టర్(Twitter)వేదికగా వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ట్విట్టర్‌లో బన్నీ ఫ్యాన్స్ ‘ ఏం పీకలరు బ్రదర్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో నేషనల్ వైడ్ ట్రెండింగ్ చేశారు. అయితే దీనిపై దాదాపు తెలుగులో అన్నీ మీడియాలో వార్తలు ,కథనాలు వచ్చాయి. మెగా హీరోల ట్యాగ్ నుండి బన్నీని తీసేశారు అంటూ ప్రచారం జరుగుతుంది. తాజాగా విజయవాడలో(Vijaywada) మెగా అభిమానుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ క్రమంలో నే అక్కడ బన్నీ ఫోటోను లేకుండా ఓ ఫోటో దర్శనమిచ్చింది. అంతే, బన్నీ మెగా హీరోకాదట అంటూ..వార్తలు వైరల్ అయ్యాయి.

ఇక ఇదే క్రమంలో అఖిల భారత చిరంజీవి(Chiranjeevi) అభిమానుల సంఘం అధ్యక్షుడు అయిన భవాని రవి కుమార్.."నేను చెప్పను బ్రదర్"అంటూ చాలా సార్లు బన్నీ అన్న డైలాగ్‌ను  ప్రస్తావించారట.బన్నీపై కీలక విమర్శలు కూడా చేశారు. బన్నీకి ఇదే లాస్ట్ సినిమా.. మరే సినిమా కోసం పనిచేయమని భవానీ మెగా అభిమానుల మీటింగ్‌లో వాడి వేడి వ్యాఖ్యలు చేశారు.  దీంతో బన్నీ ఫ్యాన్స్ కు కోపం వచ్చింది. మెగా అభిమానుల్ని.."ఏం పీకలేరు బ్రదర్" అంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. దీంతో ఓ మెగా హీరో మ్యాటర్ లోకి ఎంటర్ అయ్యి..భవని రవి కుమార్ దగ్గర సారీ చెప్పించారట. ఎట్టకేలకు అనుకున్నది సాధించిన బన్నీ ఫ్యాన్స్ ఇకనైనా శాంతిస్తారో లేదో చూడాలి..?

గతంలోనే బన్నీ బీహేవీయర్ బాగోలేదని..చీరంజీవి బర్త డే(Chiranjeevi Birthday party) పార్టీకి పిలిస్తే అందరు వెళ్లినా ఆయన వెళ్లలేదు అని..దీంతో ఆయనకు హెడ్ వెయిట్ ఎక్కువైందని మెగా ఫ్యాన్స్ మండిపడ్డారు. బన్నీ ఎందుకు చిరు బర్త డే పార్టీకి వెళ్లలేదో  ఇప్పటికి బయటపడలేదు. ఇక  అప్పటి నుండి సోషల్ మీడియాలో మెగా VS అల్లు ఫ్యాన్స్ వార్ టైం వచ్చినప్పుడల్లా..బయటపడుతూనే ఉంది. ఇటీవలే బన్నీ నటించిన  పుష్ప సినిమా ప్రమోషన్స్ టైంలో..రిలీజ్ అయ్యక టాక్ పరంగా మెగా ఫ్యాన్స్ ఆడేసుకున్నారు. ఆ తరువాత రామ్ చరణ్(Ram Charan) RRR తో హిట్ కొట్టినప్పుడు కూడా..బన్నితో కంపేర్ చేస్తూ.దారుణంగా ట్రోల్ చేశారు. సరైన టైం కోసం చూసిన బన్నీ ఫ్యాన్స్..ఆచార్య తో మెగా ఫ్యాన్స్ కి ఘాటు కౌంటర్లు ఇచ్చారు.ఇలా ఎప్పటికప్పుడు బన్నీ, మెగా ఫ్యాన్ల మధ్య వార్ నడుస్తూనే ఉంది. మరి ఇప్పుడు బన్నీకి బిగ్ సారీ చెప్పడంతో అయినా... అల్లు అర్జున్  ఆర్మీ కూల్ అవుతుందో లేదో చూడాలి.

First published:

Tags: Allu Arjun, Chiranjeevi, Mega Family, Ram Charan

ఉత్తమ కథలు