రాం చరణ్, అల్లు అర్జున్ మధ్య ఫైట్‌పై క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్... మామ పవన్ కల్యాణ్ పార్టీకి...

రాం చరణ్, అల్లు అర్జున్ చిన్నతనం నుంచి కలిసి పెరిగారు... మామయ్య పవన్ కల్యాణ్ గారికి మా మద్ధతు ఎప్పుడూ ఉంటుంది... ఇలాంటి వార్తలన్నీ కేవలం క్లిక్స్ కోసమే... ‘ఏబీసీడీ’ ప్రమోషన్‌లో మెగా హీరో అల్లు శిరీష్ వ్యాఖ్యలు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 21, 2019, 2:14 AM IST
రాం చరణ్, అల్లు అర్జున్ మధ్య ఫైట్‌పై క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్... మామ పవన్ కల్యాణ్ పార్టీకి...
రాం చరణ్, అల్లు అర్జున్ చిన్నతనం నుంచి కలిసి పెరిగారు... మామయ్య పవన్ కల్యాణ్ గారికి మా మద్ధతు ఎప్పుడూ ఉంటుంది... ఇలాంటి వార్తలన్నీ కేవలం క్లిక్స్ కోసమే... ‘ఏబీసీడీ’ ప్రమోషన్‌లో మెగా హీరో అల్లు శిరీష్ వ్యాఖ్యలు...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 21, 2019, 2:14 AM IST
మెగా పవర్‌స్టార్ రాం చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మధ్య ఏం జరిగింది? మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ ఇద్దరు స్టార్ల మధ్య విబేధాలు మొదలయ్యాయా? ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్‌లా కలిసి సినిమాల్లో కూడా నటించిన ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు అస్సలు పడడం లేదా? ఈ అనుమానాలే ఇప్పుడు టాలీవుడ్‌ను కుదిపేస్తున్నాయి. దానికి కారణం సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న వార్తలే. దీనికి అటు అల్లు అర్జున్ గానీ, ఇటు రాం చరణ్ గానీ స్పందించక పోవడంతో ఈ వార్తల్లో కాస్తో కూస్తో నిజం ఉండొచ్చనే అనుమానలు రేగాయి. అయితే తాజాగా ‘ఏబీసీడీ’ సినిమాతో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునేందుకు బాక్సాఫీస్ దగ్గరకు వచ్చిన అల్లు అర్జున్ తమ్ముడు, మెగా హీరో అల్లు శిరీష్... ఈ విషయాలపై స్పందించాడు. ఈ వార్తల్లో అసలు నిజం లేదని, కేవలం క్లిక్స్ కోసం కొందరు క్రియేట్ చేసిన రూమర్స్ అని కుండబద్ధలు కొట్టేశాడు అల్లు శిరీష్. రాం చరణ్, అల్లు అర్జున్ చిన్నతనం నుంచి కలిసి పెరిగారని చెప్పిన అల్లు శిరీష్... వారిద్దరి మధ్య మంచి స్నేహానుబంధం ఉందని తెలిపాడు. బయటికి కనిపించకపోయినా ఇద్దరూ తరుచుగా కలుసుకుంటూ, చాలా విషయాల గురించి చర్చించుకుంటూ ఉంటారని చెప్పాడు అల్లు శిరీష్. రాం చరణ్ హీరోగా నటించిన ‘ఎవడు’ సినిమాలో అల్లు అర్జున్ ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఓ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న అల్లు అర్జున్... రాం చరణ్ తన తమ్ముడిలాంటి వాడని చెప్పిన విషయమూ తెలిసిందే.
allu arjun, pawan kalyan, janasena party, palakollu public meeting, palakollu sabha, pawan kalyan allu arjun, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, పాలకొల్లు సభ, జనసేన పార్టీ
తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన అల్లు అర్జున్‌ను ఆలింగనం చేసుకున్న పవన్ కల్యాణ్


అయితే ఓ సినిమా ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ నుంచి ఆయన గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ‘చెప్పను బ్రదర్’ అంటూ బన్నీ చేసిన కామెంట్స్... ఇండస్ట్రీలో పెను దుమారం క్రియేట్ చేశాయి. ఆ తర్వాత అల్లు అర్జున్‌కీ, పవన్ కల్యాణ్‌కీ పడడం లేదనే టాక్ బాగా వినిపించింది. రాం చరణ్ మాత్రం బాబాయ్‌కి ఆప్తుడిగా మెలుగుతుండడంతో ఈ విషయంలో బన్నీకీ-చెర్రీకి మధ్య చెడిందనే వార్తలు షికార్లు చేశాయి. అయితే అదేం లేదని తాజాగా స్పష్టం చేశాడు అల్లు శిరీష్. మెగా హీరోలందరి మధ్య ఎలాంటి ఈగో ప్రాబ్లమ్స్ లేవనీ, అందరం కలిసే ఉన్నామని క్లారిటీ ఇచ్చాడు అల్లువారి అబ్బాయి.
Ram Charan will do Campaign for Janasena Party along with Pawan Kalyan in Vijayawada pk.. రామ్ చరణ్ కూడా ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడు. పదేళ్ల కింద ప్రజారాజ్యం పార్టీ తరఫున తండ్రితో పాటు బయటికి వచ్చాడు మెగా వారసుడు. అప్పట్నుంచి ఇప్పటి వరకు మళ్లీ రాజకీయాలతో పనిలేకుండా హాయిగా తన పని తాను చేసుకుంటున్నాడు చరణ్. ram charan,ram charan twitter,team ram charan twitter,ram charan campaign for pawan kalyan,ram charan campaign vijayawada,ram charan facebook,ram charan vote for glass,ram charan rrr movie shooting,ram charan rrr shooting break,janasena 2019 elections,ram charan pawan kalyan,2019 general elections,ram charan republic day gift to pawan kalyan,ram charan janasena,ram charan pawan kalyan janasena,pawan kalyan janasena,janasena party song,ram charan pawan kalyan,telugu cinema,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ రామ్ చరణ్,జనసేన పార్టీ సాంగ్ రామ్ చరణ్,రామ్ చరణ్ రిపబ్లిక్ డే గిఫ్ట్ పవన్ కళ్యాణ్,తెలుగు సినిమా,జనసేన పార్టీ సాంగ్ రామ్ చరణ్,
రాం చరణ్, పవన్ కళ్యాణ్

ఈ సారి ప్రత్యేక్ష రాజకీయాల్లో బరిలో నిలిచిన తన మేనమామ పవన్ కల్యాణ్ గురించి కూడా ప్రస్తావించాడు అల్లు శిరీష్. ‘నాకు పవన్ కల్యాణ్ గారంటే ఎంతో ఇష్టం. ఆయన జనసేన పార్టీకి మా మద్ధతు ఎప్పుడూ ఉంటుంది. అన్నయ్య అల్లు అర్జున్ కూడా జనసేన పార్టీకి బహిరంగంగానే మద్ధతు ప్రకటించారు. రాం చరణ్ అయితే స్వయంగా వెళ్లి పవన్ కల్యాణ్, నాగబాబులతో ప్రచారంలో పాల్గొన్నారు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. రావు...’ అంటూ చెప్పుకొచ్చాడు అల్లు శిరీష్. ఇదిలా ఉంటే మనోడి తాజా సినిమా ‘ఏబీసీడీ’ అల్లు శిరీష్ ఆశిస్తున్న విజయాన్ని అందించలేకపోయింది. మొదటి షో నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ‘ఏబీసీడీ’... అల్లు శిరీష్ ఖాతాలో మరో ఫ్లాప్‌ను చేర్చినట్టు అని చెబుతున్నారు ట్రేడ్ పండితులు.

First published: May 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...