MEGA FANS STRONG WARNING TO JABARDASTH COMEDIAN HYPER AADI FOR HIS SPOOF OVER MEGASTAR CHIRANJEEVI SYE RAA MOVIE PK
హైపర్ ఆదిపై మెగా ఫ్యాన్స్ ఫైర్.. ఓవర్ యాక్షన్ తగ్గించుకోమని వార్నింగ్..
హైపర్ ఆది ఫేస్ బుక్ ఫోటో (Source: Facebook)
జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆదిని మించిన వాళ్లు ప్రస్తుతం ఎవరూ లేరు. ఈయన స్కిట్ వస్తే చాలు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. జబర్దస్త్ కామెడీ షోలో ఎవరికీ లేని యూ ట్యూబ్ ఫాలోయింగ్ ఆది సొంతం.
జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆదిని మించిన వాళ్లు ప్రస్తుతం ఎవరూ లేరు. ఈయన స్కిట్ వస్తే చాలు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. జబర్దస్త్ కామెడీ షోలో ఎవరికీ లేని యూ ట్యూబ్ ఫాలోయింగ్ ఆది సొంతం. మనోడు ఏదైనా స్కిట్ చేసాడంటే చాలు.. అందులో నవ్వులతో పాటు కాంట్రవర్సీలకు కూడా కొదవే ఉండదు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. అసలు వివాదంలోంచి వినోదం వెతుక్కోవడమే హైపర్ ఆది స్టైల్. ఎప్పటికప్పుడు సెన్సేషనల్ స్కిట్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు ఈ కుర్ర కమెడియన్. అయితే మెగా హీరోలకు భక్తుడిగా ఉండే ఆదిపై ఇప్పుడు వాళ్లే మండిపడుతున్నారు.
సైరా స్పూఫ్ చేసిన హైపర్ ఆది
మెగా ఫ్యాన్స్ కోపానికి కారణం అవుతున్నాడు ఆది. దానికి కూడా ప్రత్యేకంగా కారణాలు లేకపోలేవు. మనోడు ప్రతీ స్కిట్లో కూడా చిరంజీవి లేదంటే మెగా హీరోల పాటలతో ఎంట్రీ ఇస్తుంటాడు. ఇప్పుడు ఏకంగా ఆ గెటప్స్‌తోనే వస్తున్నాడు. మొన్నామధ్య గబ్బర్ సింగ్.. ఆ తర్వాత గద్దలకొండ గణేష్.. ఇప్పుడు సైరా నరసింహా రెడ్డి.. ఇలా కొత్త సినిమా విడుదలైతే చాలు అందులోకి దూరిపోతున్నాడు ఆది. ఇదే ఇప్పుడు అభిమానులకు కోపం తెప్పిస్తుంది. సూట్ కాకపోయినా కామెడీ కోసం అలాంటి గొప్ప కారెక్టర్స్ తీసుకుని కామెడీ చేస్తున్నాడంటూ ఆదిపై మండిపడుతున్నారు ఫ్యాన్స్.
హైపర్ ఆది గద్దలకొండ గణేష్ (Source: youtube)
దయచేసి అలాంటి ఓవర్ యాక్షన్ చేయకు ఆది అంటూ సోషల్ మీడియాలో మనోడికి చాలా మర్యాదగా చెప్తున్నారు.. కొందరు అయితే కాస్త ఘాటుగానే వార్నింగులు కూడా ఇస్తున్నారు. మెగా అభిమాని అయినా కూడా అలాంటి గెటప్స్‌లో కనిపిస్తే అసలు సహించలేం అంటున్నారు వాళ్లు. అన్నింటికి మించి చిరంజీవి ఉయ్యాలవాడ గెటప్‌ను స్పూఫ్ చేసాడు ఆది. అందులోనే మగధీర, బాహుబలి సినిమాలను కూడా కలిపేసాడు.
హైపర్ ఆది పవన్ కళ్యాణ్
తెలుగు ఇండస్ట్రీ ప్రైడ్‌గా భావించే సినిమాలను అలా నీ కామెడీ కోసం కంగాళీ చేస్తావా అంటూ మనోడితో ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. దీనిపై హైపర్ ఆది మాత్రం లైట్ తీసుకుంటున్నాడు. తానేం చేసినా కూడా కామెడీ కోసమే అని.. నవ్వించడం తన లక్ష్యం అంటున్నాడు ఈ కమెడియన్. గతంలోనూ మనోడు చేసిన కామెడీకి చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. కానీ అవేం పట్టించుకోకుండా దూసుకెళ్తున్నాడు ఆది. మరి ఈయన జోరుకు ఎక్కడ బ్రేకులు పడతాయో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.