‘రంగస్థలం’ సినిమాతో నటుడిగా ఎంతో ఎదిగాడు రామ్ చరణ్. అప్పటి వరకు ఆయన గురించి విమర్శలు చేసిన వాళ్ళంతా ఒక్క సినిమాతో నోరు మూసుకున్నారు. తనకే సాధ్యమైన నటనతో నిజమైన మెగా వారసుడు అనిపించుకున్నాడు చరణ్. దానికి ముందు కమర్షియల్ సినిమాలు చేస్తూ మాస్ మసాలా అంటూ రొటీన్ కథలకు అలవాటుపడిన చరణ్.. ‘ధృవ’, ‘రంగస్థలం’ సినిమాలతో కొత్తగా ప్రయత్నించి విజయం అందుకున్నాడు. ఇదే దారిలో నడుస్తాడేమో అనుకుంటున్న తరుణంలో సినిమా మొదట్లోనే భయపెట్టాడు రామ్ చరణ్.
అభిమానులు ఏదైతే భయపడ్డారో అదే జరిగింది ఇప్పుడు. ‘వినయ విధేయ రామ’ తొలిరోజు టాక్ విన్న తర్వాత రామ్ చరణ్ ఎంత దారుణమైన తప్పు చేశాడనేది అర్థమవుతోంది. నటుడిగా పది మెట్లు ఎక్కిన రామ్ చరణ్ ను ఒకే సినిమాతో వంద మెట్లు దించేసాడు బోయపాటి శ్రీను. మాస్ యాక్షన్ డ్రామా అంటూ చరణ్ తో ఊర మాస్ సినిమా చేసి అందులో కథ అనేది లేకుండా చేశాడు ఈ దర్శకుడు. అర్థం పర్థం లేని సీన్స్.. చూస్తేనే చిరాకు వచ్చే యాక్షన్ సన్నివేశాలు.. అసలు స్క్రీన్ ప్లే అంటూ లేని కథ ఉన్న ‘వినయ విధేయ రామ’ను చూసిన తర్వాత రామ్ చరణ్ కథల ఎంపికపైనే అనుమానం వచ్చేలా చేస్తున్నాయి.
రాజమౌళి సినిమాకు ముందు ఇలాంటి సినిమా ఒకటి చేయడం చరణ్‌కి పెద్ద దెబ్బ అంటున్నారు విశ్లేషకులు. బోయపాటి సినిమా అంటే కొత్త కథ అని ఎవరు అనుకోరు.. కానీ మరీ ఇంత చెత్త కథ చేస్తాడని కూడా ఎవరూ అనుకోలేదు. ఇదే ఇప్పుడు అభిమానులకు షాక్. మొత్తానికి ఇప్పుడు ‘వినయ విధేయ రామ’ రామ చరణ్‌ను ఎటూ కదలలేని పరిస్థితుల్లో పడేసింది. మరి ఈ చిత్ర ఫలితం ఎంత దారుణంగా ఉండబోతుందో చూడలేక.
ఇవి కూడా చదవండి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Boyapati Srinu, Ram Charan, Telugu Cinema, Tollywood, Vinaya Vidheya Rama