ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీనే పెద్ద మాఫియా.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమారంగం మొత్తం ఆ నలుగురు పెద్దల చేతిలో ఉందన్న రూమర్ ఎప్పటినుండో వినపడుతున్నదే. ఆ నలుగురు పెద్దలు సరే అంటే తప్ప చిన్న సినిమాలు రిలీజ్‌కు కూడా నోచుకోలేని పరిస్థితి అని టాలీవుడ్‌లో టాక్ ఉంది. అయితే ఇదే విషయం పై నాగబాబు స్పందించారు.

news18-telugu
Updated: February 16, 2019, 2:27 PM IST
ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీనే పెద్ద మాఫియా.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు
నాగబాబు(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలుగు సినిమారంగం మొత్తం ఆ నలుగురు పెద్దల చేతిలో ఉందన్న రూమర్ ఎప్పటినుండో వినపడుతున్నదే. ఆ నలుగురు పెద్దలు ఊ.. అంటే తప్ప చిన్న సినిమాలు రిలీజ్‌కు కూడా నోచుకోలేని పరిస్థితి అని టాలీవుడ్‌లో టాక్ ఉంది. అయితే ఇదే విషయమై తాజాగా నాగబాబును ప్రశ్నించగా... ఆయన స్పందిస్తూ.. ‘‘అక్కినేని ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, సురేష్ బాబు ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ’ ఈ నలుగురు.. ఒకవైపు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు.. మరోవైపు అల్లు అరవింద్ గారు.. ఇంకోవైపు డిస్ట్రిబ్యూటర్ సురేష్ బాబు. వీళ్లను పక్కనబెడితే ఇంతకంటే పెద్ద మాఫియా ఎవరుంటారు. మేమే పెద్ద మాఫియా. అరవింద్ గారు ఓ దావూద్ ఇబ్రహీం.. మా అన్నయ్య ఒక చోటా రాజన్.. లేదంటే సురేష్ బాబు ఒక చోటా రాజన్ అని అన్నారు. అని ఆ తర్వాత..ఇవన్నీ పిచ్చి ఆరోపణలు.. పిచ్చి మాటలు. ఇక్కడ ఎవ్వరినీ ఎవరూ కంట్రోల్ చేయలేరు. చిన్న సినిమాలు రిలీజ్ కాకపోవడానికి డిస్ట్రిబ్యూటర్స్‌కు సంబంధించిన విషయమది. ఆ నలుగురు చేతుల్లోనే మొత్తం సినిమా రంగం గ్రిప్ ఉంటే మరి మా వాళ్లకు ఫ్లాప్‌లు ఎందుకొస్తున్నాయి? అని అన్నారు.

Naga Babu Once Again targeted TDP.. Satires on ABN Channel and Nara Lokesh kp.. ఈ మ‌ధ్య కాలంలో నాగ‌బాబు పేరు త‌లుచుకుంటేనే వివాదాలు న‌డుచుకుంటూ వ‌స్తున్నాయి. ఇప్పుడు మ‌రోసారి ఇదే చేసాడు ఈయ‌న‌. ఎప్పుడూ ఏదో పార్టీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూనే ఉన్న నాగ‌బాబు.. ఇప్పుడు ఏకంగా ఓ ఛానెల్ అధినేత‌ను టార్గెట్ చేసాడు. naga babu nara lokesh,naga babu abn radhakrishna,naga babu youtube channel,naga babu nara chandrababu naidu,naga babu ys jaganmohan reddy,naga babu satires on ys jagan and chandrababu naidu,naga babu balakrishna,naga babu Telugu Desam Party,naga babu targeted Telugu Desam Party,telugu cinema,naga babu targeted tdp,నాగబాబు,నాగబాబు ఏబిఎన్ రాధాకృష్ణ,నాగబాబు చంద్రబాబునాయుడు జగన్,నాగబాబు తెలుగుదేశం,నాగబాబు నారా లోకేష్,నాగబాబు బాలయ్య,తెలుగు సినిమా
నాగబాబు ఫైల్ ఫోటో


ఇంకా ఆయన మాట్లాడుతూ.. కొన్ని థియేటర్స్ అరవింద్, దిల్ రాజు చేతుల్లో ఉండొచ్చు. చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాదు. ఫిబ్రవరి నుండి..ఏప్రిల్ వరకూ పెద్దగా సినిమాలేం రిలీజ్ కావు. అప్పుడు చిన్న సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు కానీ బిజీగా ఉన్న టైంలోనే రిలీజ్ వాళ్లు రిలీజ్ చేయాలంటారు. డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ డబ్బులొచ్చే సినిమానే తీసుకుంటారు. చిన్న సినిమా లేదా పెద్ద సినిమా అని కాదు.. సినిమాలో దమ్ము, కెపాసిటీ ఉంటేనే అవి ఆడతాయి. ఇప్పుడున్న పరిస్థితిల్లో పెద్ద సినిమాలు కూడా 3 నుండి 4 వారాలకు మించి ఆడే కెపాసిటీ లేదు అని అన్నారు.
దీపికా పదుకొనే లేటెస్ట్ హాట్ ఫోటోస్
First published: February 16, 2019, 1:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading