మెగా క్రికెట్ టీం సిద్ధం.. మ‌రో తేజ్ వ‌స్తున్నాడు..

ఈ మ‌ధ్యే మెగా అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ కూడా "విజేత" సినిమాతో వ‌చ్చాడు. ఈయ‌న‌కు ముందు చిరంజీవి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్.. నాగ‌బాబు.. అల్లుఅర్జున్.. రామ్ చ‌ర‌ణ్.. అల్లు శిరీష్.. సాయిధ‌రంతేజ్.. వ‌రుణ్ తేజ్.. క‌ళ్యాణ్ దేవ్.. నిహారిక మెగా కుటుంబం నుంచి ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. ఇప్పుడు 11వ వాడిగా వైష్ణ‌వ్ వ‌స్తున్నాడు.

news18-telugu
Updated: September 8, 2018, 11:33 AM IST
మెగా క్రికెట్ టీం సిద్ధం.. మ‌రో తేజ్ వ‌స్తున్నాడు..
మెగా ఫ్యామిలీ న్యూస్ 18
  • Share this:
మా ఇంట్లో ఎంత మంది హీరోలున్నారో మాకే గుర్తు లేదు.. ఒక్కోసారి అంద‌రి పేర్లు చెప్పాలంటే టైమ్ ప‌డుతుంది.. ఈ మాట‌లు అన్న‌ది ఎవరో కాదు.. మెగా హీరో వ‌రుణ్ తేజ్. ఆ మ‌ధ్య ఓ ఆడియో వేడుక‌లో త‌న కుటుంబ హీరోల గురించి చెబుతూ ఈ మాట‌ల‌న్నాడు వ‌రుణ్. క్రికెట్ టీంకు స‌రిపోయేలా ఉన్నామంటూ సెటైర్లు కూడా వేసుకున్నాడు. ఈయ‌న అన్నాడ‌ని కాదు కానీ ఇప్పుడు నిజంగానే మెగా కుటుంబం నుంచి క్రికెట్ టీం ఒక‌టి సిద్ధ‌మ‌వుతుంది. చూసేవాళ్ల‌కు ఇది ఇబ్బందిగా అనిపించినా కూడా వాళ్లు మాత్రం త‌గ్గ‌డం లేదు.

mega family in tollywood
మెగా ఫ్యామిలీ ఫైల్ ఫోటో


ఒకే కుటుంబం నుంచి ఇంత‌మంది హీరోలు రావ‌డం అనేది చిన్న విష‌యం కాదు. బ‌హుశా ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే ఎవ‌రూ ఇంత‌గా రాలేదు. కానీ చిరంజీవి నీడ‌లో వ‌స్తూనే ఉన్నారు మెగా హీరోలు. ఇండ‌స్ట్రీలో ఎక్క‌డ చూసినా వాళ్ళే క‌నిపిస్తున్నారు. ఇప్పుడు సాయిధ‌రంతేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ కూడా ఇండ‌స్ట్రీకి వ‌స్తున్నాడు. ఈయ‌న తొలి సినిమాకు ఏర్పాట్లు వేగంగా జ‌రుగుతున్నాయి. సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌లో మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొంద‌బోతుంద‌ని తెలుస్తుంది. బుచ్చిబాబు ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇప్ప‌టికే వైష్ణ‌వ్ న‌ట‌నలో శిక్ష‌ణ తీసుకుని.. లాంఛింగ్‌కు సిద్ధంగా ఉన్నాడు.

vaishnav tej entry..
వైష్ణవ్ తేజ్ ఫేస్‌బుక్ ఫోటో


ఈ మ‌ధ్యే మెగా అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ కూడా "విజేత" సినిమాతో వ‌చ్చాడు. ఈయ‌న‌కు ముందు చిరంజీవి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్.. నాగ‌బాబు.. అల్లుఅర్జున్.. రామ్ చ‌ర‌ణ్.. అల్లు శిరీష్.. సాయిధ‌రంతేజ్.. వ‌రుణ్ తేజ్.. క‌ళ్యాణ్ దేవ్.. నిహారిక మెగా కుటుంబం నుంచి ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. ఇప్పుడు 11వ వాడిగా వైష్ణ‌వ్ వ‌స్తున్నాడు. తెలిసన్నాడో.. లేదంటే అలా యాదృశ్చికంగా అన్నాడో తెలియ‌దు కానీ ఇప్పుడు నిజంగానే మెగా కుటుంబం నుంచి క్రికెట్ టీం సిద్ధ‌మైపోయింది.

mega family in tollywood
మెగా ఫ్యామిలీ


ఒకే కుటుంబం నుంచి ఇంత‌మంది ఏంటి అనే తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. అయితే ఇందులో నాగ‌బాబు కారెక్ట‌ర్ ఆర్టిస్ట్.. అల్లు శిరీష్, క‌ళ్యాణ్ దేవ్ మాత్ర‌మే నిరూపించుకోవాల్సి ఉంది. మిగిలిన వాళ్లంతా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. అంతా సొంత గుర్తింపుతో ముందుకు దూసుకెళ్తున్నారు. విష‌యం లేక‌పోతే వార‌సులైనా చూడ‌రు క‌దా అని ప్రేక్ష‌కులు కూడా రివ‌ర్స్ కౌంట‌ర్ వేస్తున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: September 8, 2018, 11:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading