news18-telugu
Updated: November 19, 2019, 3:56 PM IST
జార్జిరెడ్డి కి చిరంజీవి సపోర్ట్ (Twitter/Photo)
ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. ఇదే కోవలో ఒకప్పటి ఓయూ విద్యార్ధి నాయకుడు ‘జార్జి రెడ్డి’ జీవిత చరిత్రపై అదే పేరుతో సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమాకు మెగా హీరోల మద్దతు పెరిగుతోంది. ఇప్పటికే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్.. జార్జ్ రెడ్డి తనకు ఎంతో ప్రేరణ ఇచ్చాడని పవన్ కళ్యాణ్.. ఈ సినిమాకు తన సపోర్ట్ ఇచ్చాడు.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు పవన్ కళ్యాణ్ వద్దామనుకున్నాడు. కానీ ఆయన రాకతో శాంతి భద్రతల సమస్య రావొచ్చనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దైయింది. మరోవైపు మెగాబ్రదర్ నాగబాబు.. జార్జి రెడ్డి జీవితం తనలాంటి వాళ్లెందరికో స్పూర్తి నిచ్చిందన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. జార్జి రెడ్డి సినిమాకు తన మద్దతు తెలిపారు.

జార్జి రెడ్డి పాత్రలో పవన్ కల్యాణ్... నాగబాబు మనసులో మాట
1972లో నేను ఒంగోలులో ఇంటర్ చదువుతున్నపుడు జార్జ్ రెడ్డి పేరు విన్నానని చెప్పారు. ఆ తర్వాత ఇన్నేళ్లకు ‘జార్జ్ రెడ్డి’, మ్యాన్ ఆఫ్ యాక్షన్’ అనే పేరుతో తెరకెక్కిన ఈ సినిమా పేరు వింటున్నానన్నారు. తాజాగా అప్పట్లో నేను విన్నదాన్ని బట్టి ఆయన ఎలాంటి ఆశయాలతో ఉండేవారు ? ఏ విధంగా అన్యాయం జరిగినా.. అణిచివేత జరిగినా.. విద్యార్ధి నాయకుడిగా జార్జి రెడ్డి ఎలా స్పందించే వారనే విషయాన్ని ఈ సినిమాలో చూపెట్టారనే విషయం ఈ సినిమా ట్రైలర్ చూస్తే అర్ధమవుతుందన్నారు. ఇప్పటి తరంవాళ్లు ‘జార్జి రెడ్డి’ జీవితంతో కనెక్ట్ అవుతారని ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందనే ఆశాభావం వ్యక్తం చేసారు. మొత్తానికి ఒక్కొక్కరిగా మెగా హీరోలందరు ‘జార్జి రెడ్డి’ సినిమాకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఇప్పటి తరం ఈ సినిమా చూడాలని పిలుపు నిచ్చారు. నేను కూడా ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నట్టు చెప్పుకొచ్చారు. దళం ఫేమ్ జీవన్ రెడ్డి తెరకెక్కించిన సందీప్ మాధవ్, సత్యదేవ్ ముఖ్యపాత్రల్లో నటించారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 19, 2019, 3:56 PM IST