కొత్త రూట్లో వెళుతున్న మెగా ఫ్యామిలీ హీరోలు..

మెగా ఫ్యామిలీ హీరోలందరు ఒకరి తర్వాత మరొకరు అదే రూట్లో వెళుతున్నారు. ఇది చూసి మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.  వివరాల్లోకి వెళితే..

advertorial
Updated: July 20, 2020, 6:44 AM IST
కొత్త రూట్లో వెళుతున్న మెగా ఫ్యామిలీ హీరోలు..
చిరంజీవి,పవన్ కళ్యాణ్,రామ్ చరణ్ (Facebook/Photos)
  • Share this:
మెగా ఫ్యామిలీ హీరోలందరు ఒకరి తర్వాత మరొకరు అదే రూట్లో వెళుతున్నారు. ఇది చూసి మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.  వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ‘రౌద్రం రణం రుధిరం’ అనే సినిమా చేస్తున్నాడు. అదేనండి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రంలో రామ్ చరణ్.. చారిత్రక యోధుడైన అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే  విడుదలైన ఈ టీజర్‌లో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో ఓ రేంజ్‌లో ఇరగదీసాడు. ఈ సినిమా కంటే ముందు చిరంజీవి..సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో చారిత్రక యోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించాడు. ఇక  రామ్ చరణ్ .. ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను రాజమౌళి  కొంచెం ఫిక్షన్ జోడించి తనదైన శైలిలో ఆర్ఆర్ఆర్‌లో అల్లూరి పాత్రను  తెరకెక్కిస్తున్నాడు.

రామ్ చరణ్ లుక్ (rrr ram charan)
రామ్ చరణ్ లుక్ (rrr ram charan)


అటు చిరంజీవి, రామ్ చరణ్ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా క్రిష్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా కూడా చారిత్రక యోధుడైన ‘పండగ సాయన్న’ పాత్ర అని చెబుతున్నారు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ తన సినీ జీవితంలో  ఫస్ట్ టైమ్ చారిత్రక పాత్ర చేస్తోన్న సినిమా ఇదే. ఈ సినిమాకు ‘విరూపాక్షి’  అనే టైటిల్ అనుకున్నారు. ఈ పేరు పూర్తిగా క్లాస్ అప్పీల్ ఉండటం. మాస్‌లో అంతగా చొచ్చుకుపోయేలా లేదని భావించి ఇపుడు ఈ  చిత్రానికి ‘బందిపోటు’,తో పాటు ‘గజ దొంగ’ అనే టైటిల్స్‌‌ను పరిశీలిస్తున్నారు. అంతకు ముందు మెగా ఫ్యామిలీ హీరో అయిన అల్లు అర్జున్ కూడా ‘రుద్రమదేవి’ చిత్రంలో గోనా గన్నారెడ్డి వంటి చారిత్రక యోధుడి పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే కదా. ఈ రకంగా మెగా ఫ్యామిలీ హీరోలందరు ఒక్కొక్కరుగా చారిత్రక పాత్రలు చేయడం చూసి మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 20, 2020, 6:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading