అవును టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఇంకా ఆ ఛాన్స్ దక్కించుకోలేకపోయింది. కానీ మిగతా ఫ్యామిలీకి చెందిన హీరోలు మాత్రం ఆ ఛాన్స్ దక్కించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తాజాగా వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటించిన ‘వెంకీ మామ’ సినిమా ఈ రోజే విడుదలైంది. మంచి టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రంలో వెంకటేష్, నాగచైతన్య వాళ్ల రియల్ లైఫ్‌లో లాగే మామ అల్లుళ్లుగా నటించడం విశేషం. అంతకు ముందు ‘ప్రేమమ్’ సినిమాలో వీళ్లిద్దరు ఇలాగే నిజ జీవిత పాత్రలైన మామా అల్లుళ్లుగా నటించడం విశేషం. ఇక అదే ‘ప్రేమమ్’ చిత్రంలో నాగార్జున, నాగ చైతన్య తండ్రి కొడుకులుగా వాళ్ల నిజ జీవిత పాత్రలనే తెరపై చేయడం విశేషం.
ఈ రెండింటి మధ్య నాగ చైతన్య తన జీవిత భాగస్వామి సమంతతో కలిసి ‘మజిలీ’ సినిమా చేయడం విశేషం. అంతకు ముందు చేసినా.. పెళ్లై ఒక బంధం ఏర్పడిన తర్వాత చేసిన సినిమా ఇదే. నాగార్జున మాత్రం పెళ్లి తర్వాత అమలతో ఏ సినిమా చేయలేకపోెయాడు. ఇంకోవైపు అక్కినేని ఫ్యామిలీలో ఏఎన్నార్, నాగార్జున కూడా ‘కలెక్టర్ గారి అబ్బాయి’, ‘అగ్ని పుత్రుడు’, ‘ఇద్దరూ.. ఇద్దరే’ సినిమాల్లో వాళ్లు నిజ జీవిత పాత్రలైన తండ్రి కొడుకులుగా తెరపై కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక నాగేశ్వరరావు, నాగార్జున.. ‘రావుగారిల్లు’, శ్రీరామదాసు’, ‘మనం’ చిత్రాల్లో నటించిన నిజ జీవిత పాత్రలను తెరపై చేయలేకపోయారు. మనంలో నాగార్జున కొడుకుగా ఏఎన్నార్, చైతూ కొడుకుగా నాగార్జున నటించారు.
నందమూరి హీరోల విషయానికొస్తే.. ఎన్టీఆర్, బాలకృష్ణ,హరికృష్ణ ‘తాతమ్మ కల’ సినిమాలో తండ్రి కొడుకులుగా నిజ జీవిత పాత్రల్లో నటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్, బాలయ్య ‘అక్బర్ సలీం అనార్కలి’, ‘శ్రీమద్విరాట పర్వం’, లో తండ్రి కొడుకులుగా నిజ జీవిత పాత్రలను వెండితెరపై పోషించారు. ఆ తర్వాత వేరే కొన్ని సినిమాల్లో తండ్రి రామారావుతో బాలకృష్ణ నటించినా.. నిజ జీవిత పాత్రలైన తండ్రి కొడుకులుగా నటించలేదు.
ఇక సూపర్ స్టార్ కృష్ణకు చెందిన ఘట్టమనేని ఫ్యామిలీ విషయానికొస్తే.. కృష్ణ, మహేష్ బాబు, ‘శంఖారావం’, ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘రాజ కుమారుడు’ సినిమాల్లో తండ్రి కొడుకులుగా నిజ జీవిత పాత్రలనే పోపించి అభిమానులను కనువిందు చేసారు.ఇక అన్న రమేష్ బాబుతో మహేష్ బాబు అన్నదమ్ములుగా నటించారు. ఇక కృష్ణ కూడా తన జీవిత భాగస్వామి విజయ నిర్మలతో ఎన్నో సినిమాల్లో పెళ్లి తర్వాత జోడిగా నటించడం ఇక చెప్పుకోవాల్సిన విషయం.
ఇక ప్రభాస్, కృష్ణంరాజు ఫ్యామిలీ విషయానికొస్తే.. ఈ పెద్దనాన్న కొడుకులు కలిసి ‘బిల్లా’, ‘రెబల్’ చిత్రాల్లో నటించినా.. నిజ జీవిత పాత్రల్లో మాత్రం నటించలేదు. ఇక ముందు ఏదైనా సినిమాల్లో పెదనాన్న, అబ్బాయి పాత్రల్లో నటిస్తారా అనేది చూడాలి.
ఇక చిరంజీవికి చెందిన మెగా ఫ్యామిలీ విషయానికొస్తే.. చిరంజీవి, నాగబాబు కొన్ని సినిమాల్లో కలిసి నటించినా.. నిజ జీవిత పాత్రలైన అన్నాదమ్ములుగా మాత్రం నటించలేదు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ‘శంకర్ దాదా జిందాబాద్’ చిత్రంలో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న అందులో కూడా వీళ్లు రక్త సంబంధం ఉన్న పాత్రలో నటించలేదు. అటు చిరంజీవి, రామ్ చరణ్ కూడా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో కలిసి నటించలేకపోయినా.. గెస్ట్‌లుగా మాత్రం ‘మగధీర’,‘బ్రూస్లీ’, ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
కానీ నిజ జీవిత పాత్రల్లో మాత్రం నటించలేదు. దీంతో మెగాభిమానులు కూడా తమ అభిమాన హీరోలను సిల్వర్ స్క్రీన్ పై నిజ జీవిత పాత్రల్లో నటిస్తే చూడాలని కోరుకుంటున్నారు. నాగబాబు, నిహారిక తండ్రి కూతుళ్లుగా నటించినా.. మెగా హీరోలు ఎవరైనా తమ నిజ జీవిత పాత్రల్లో కలిసి నటిస్తే వచ్చే ఆ కిక్కే వేరు. మరి భవిష్యత్తుల్లో అభిమానుల కోరికను తీర్చడానికి మెగా ఫ్యామిలీ హీరోలు పూనుకుంటారా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Chiranjeevi, Jr ntr, Krishna, Krishnam Raju, Mahesh Babu, Naga Chaitanya Akkineni, Nagarjuna Akkineni, NTR, Pawan kalyan, Prabhas, Ram Charan, Samantha akkineni, Telugu Cinema, Tollywood, Venkatesh, Venky Mama, Venky Mama Movie Review