
మెగా కుటుంబం గురించి కొత్తగా చెప్పాల్సిందేం లేదు. ఆ ఫ్యామిలీలో ఒక్కరో ఇద్దరో కాదు ఏకంగా పది మంది హీరోలున్నారు. అందులో చాలా మందికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.
దేశ వ్యాప్తంగా ప్రజలు సంక్రాంతి పండగను వివిధ రూపాల్లో జరుపుకుంటున్నారు. ఈ పండగ రోజున చాలా మంది ప్రజలు తమ సొంతూళ్లకు బయలు దేరి అక్కడ పండను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలా ఊర్లకు వెళ్లలేని వాళ్లు ఉన్న ఊర్లోనే ఘనంగా ఈ పండగను ఆనందంగా చేసుకుంటున్నారు. ఈ యేడాది సంక్రాంతి పండగ రోజున మెగా ఫ్యామిలీ హీరోలందరు ఒక్కచోటికి చేరారు
దేశ వ్యాప్తంగా ప్రజలు సంక్రాంతి పండగను వివిధ రూపాల్లో జరుపుకుంటున్నారు. ఈ పండగ రోజున చాలా మంది ప్రజలు తమ సొంతూళ్లకు బయలు దేరి అక్కడ పండను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలా ఊర్లకు వెళ్లలేని వాళ్లు ఉన్న ఊర్లోనే ఘనంగా ఈ పండగను ఆనందంగా చేసుకుంటున్నారు. ఈ యేడాది సంక్రాంతి పండగ రోజున మెగా ఫ్యామిలీ హీరోలందరు ఒక్కచోటికి చేరారు. అంతేకాదు అందరు కలిసి కుటుంబ పెద్దైన చిరంజీవితో కలిసి ఫోటోకు ఫోజులిచ్చారు. ఈ అరుదైన ఫ్యామిలీ ఫోటోలో పవన్ కళ్యాణ్, నాగబాబు తప్పించి మిగతా మెగా ఫ్యామిలీ హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్, చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్‌తో పాటు పవన్ కళ్యాణ్ ముద్దుల తనయుడు అకీరానందన్ కూడా చిరంజీవి ఇంట్లో జరిగిన ఈ సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నాడు. ఈ అరుదైన వేడుకకు సంబంధించిన ఫోటోను వరుణ్ తేజ్.. తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసారు. ఈ ఫోటోను మెగాభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:January 15, 2020, 13:54 IST