గత కొన్నేళ్లుగా ఏ భాషలోనైనా ఏదైనా సినిమా హిట్టైయితే వెంటనే వేరే భాషల వాళ్లు ఆ సినిమాను రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. తాజాగా బాలీవుడ్లో ప్రేమికుల దినోత్సవ కానుకగా విడుదలైన ‘గల్లీ బాయ్’ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. రణ్వీర్ సింగ్, ఆలియా భట్ నటించిన ఈ సినిమాను జోయా అక్తర్ డైరెక్ట్ చేసింది.
ఇప్పటికే రూ.50 కోట్ల క్లబ్బులో ఎంటరైన ‘గల్లీ బాయ్’ సినిమా త్వరలో రూ.100 కోట్ల క్లబ్బులో ఎంటర్ కానుంది. బాలీవుడ్లో సూపర్ హిట్‌గా దిశగా దూసుకుపోతున్న ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
ఈ సినిమాను తెలుగులో మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్‌తో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ‘గల్లీ బాయ్’ సినిమాకు సంబంధించిన తెలుగు రీమేక్ హక్కులను అల్లు అరవింద్ దక్కించుకున్నాడట. త్వరలో ఈ రీమేక్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
TSR Awards Function: ఒకే వేదికపై మెరిసిన అగ్ర నటులు
ఇవి కూడా చదవండి
బాలకృష్ణ మొదలు పెట్టాడు.. వర్మ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు..
నాగబాబు కామెంట్స్‌ను చిరంజీవి, బాలకృష్ణ సీరియస్‌గా తీసుకోలేదా..
ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ పై ఆ రాజకీయ పార్టీ అసహనం..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu aravind, Bollywood, Hindi Cinema, Ranveer Singh, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood