నాని ‘గ్యాంగ్ లీడర్’ను టార్గెట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్.. కారణం ఇదేనా..

తెలుగులో సూపర్ హిట్ అయినా  పాత సినిమాల టైటిల్స్‌ను కొత్త సినిమాలకు పెట్టడం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికే  విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న సినిమాకు ఏ ముహూర్తానా  ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ ఖరారు చేసారో.. అప్పటి నుంచి నాని మెగాఫ్యాన్స్‌కు టార్గెట్‌గా మారాడు.

news18-telugu
Updated: September 8, 2019, 10:32 AM IST
నాని ‘గ్యాంగ్ లీడర్’ను టార్గెట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్.. కారణం ఇదేనా..
నాని చిరంజీవి
news18-telugu
Updated: September 8, 2019, 10:32 AM IST
తెలుగులో సూపర్ హిట్ అయినా  పాత సినిమాల టైటిల్స్‌ను కొత్త సినిమాలకు పెట్టడం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికే  విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న సినిమాకు ఏ ముహూర్తానా  ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ ఖరారు చేసారో.. అప్పటి నుంచి నాని మెగాఫ్యాన్స్‌కు టార్గెట్‌గా మారాడు. నాని తన సినిమాకు ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ పెట్టకోడంపై  మెగా ఫ్యాన్స్ మాత్రం నాని ఓ ఆట ఆడుకుంటున్నారు. నువ్వు గ్యాంగ్ లీడర్ ఏంటి ? ఇప్పటికీ ఎప్పటికీ గ్యాంగ్ లీడర్ అంటే చిరంజీవి అంటూ నానిపై దుమ్మెత్తి పోస్తున్నారు. నాని కొత్త సినిమాకు  ‘గ్యాంగ్ లీడర్‌’ టైటిల్‌పై మెగా ఫ్యాన్స్ పెద్ద రచ్చే చేస్తున్నారు. దీనిపై మెగా ఫ్యాన్స్ కావాలనే రచ్చ చేస్తూ నాని టార్గెట్ చేస్తున్నరంటూ మరో వర్గం వాదిస్తోంది. ఇప్పటికే చిరంజీవి హీరోగా నటించిన ‘రాక్షసుడు’ టైటిల్‌తో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా. అంతకు ముందు సూర్య కూడా తన డబ్బింగ్ మూవీకి ‘రాక్షసుడు’ టైటిల్ పెట్టుకున్ననోరు మెదపలేదు మెగాఫ్యాన్స్.

మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌తో వస్తోన్న నాని


అంతకు ముందు అల్లరి నరేష్ కూడా తన సినిమాకు చిరంజీవి సూపర్ హిట్ ‘యముడికి మొగుడు’ టైటిల్ పెట్టుకున్న ఏమి అనలేదు. కానీ నాని మాత్రం తన కొత్త సినిమాకు ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ పెట్టేసరికి మాత్రం భగ్గు మంటున్నారు. దీనికో కారణం ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. గ్యాంగ్ లీడర్ సినిమాను రీమేక్ చేద్దామనే ఆలోచనలో ఉన్నట్టు అప్పట్లో చెప్పాడు. దీంతో మెగాఫ్యాన్స్ ఎప్పటికైనా రామ్ చరణ్‌ను గ్యాంగ్ లీడర్‌గా చూద్దామనుకున్నారు. ఈ లోపే నాని ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌తో సినిమా చేయడంతో మెగాభిమానులు చాలా హర్ట్ అయ్యారు. అదే చిరంజీవి నటించిన వేరే టైటిల్ పెట్టినా పెద్దగా అభ్యంతరం పెట్టకపోయేవారమే. అందుకే నాని నువ్వు ‘గ్యాంగ్ లీడర్’వా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రయూనిట్ ఈ సినిమాను ‘గ్యాంగ్ లీడర్’ కాకుండా ‘nani's గ్యాంగ్ లీడర్’గా టైటిల్ మార్చారు. ఏమైనా హీరో నాని తన సినిమాకు ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ పెట్టుకోవడం పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. మరోవైపు ఈ విషయమై మెగా ఫ్యాన్స్ సంయమనం పాటిస్తే బెటర్ అంటున్నారు సామాన్య ప్రేక్షకులు. 

First published: September 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...