హోమ్ /వార్తలు /సినిమా /

Ram Charan - Shankar: 7 నిమిషాల సీక్వెన్స్.. 70 కోట్ల బడ్జెట్.. RC 15 కోసం శంకర్ అరాచకం..

Ram Charan - Shankar: 7 నిమిషాల సీక్వెన్స్.. 70 కోట్ల బడ్జెట్.. RC 15 కోసం శంకర్ అరాచకం..

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో విషయం బయటికి వచ్చింది. ఇందులో ఓ పాట కోసం ఏకంగా 25 కోట్లు ఖర్చు చేయించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. సాధారణంగానే తన సినిమాలలో పాటల కోసం భారీగా ఖర్చు చేయిస్తుంటాడు శంకర్. తాజాగా చరణ్ సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఇందులో ఒక్క పాట కోసం 25 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో విషయం బయటికి వచ్చింది. ఇందులో ఓ పాట కోసం ఏకంగా 25 కోట్లు ఖర్చు చేయించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. సాధారణంగానే తన సినిమాలలో పాటల కోసం భారీగా ఖర్చు చేయిస్తుంటాడు శంకర్. తాజాగా చరణ్ సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఇందులో ఒక్క పాట కోసం 25 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

Ram Charan - Shankar: శంకర్ (Shankar) సినిమా అంటే బడ్జెట్ ఎంత అని అడగాలి. ఎందుకంటే ఈయన ఒక్కో సినిమా కోసం పెట్టే బడ్జెట్‌తో కనీసం 10 సినిమాలు తీయొచ్చు. తాజాగా రామ్ చరణ్ (Ram Charan) సినిమా విషయంలోనూ శంకర్ బడ్జెట్ హద్దులు దాటేస్తున్నాడని ప్రచారం మొదలైంది.

ఇంకా చదవండి ...

శంకర్ సినిమా అంటే బడ్జెట్ ఎంత అని అడగాలి. ఎందుకంటే ఈయన ఒక్కో సినిమా కోసం పెట్టే బడ్జెట్‌తో కనీసం 10 సినిమాలు తీయొచ్చు. ఐదేళ్ళ కిందే 2.0 సినిమా కోసం 400 కోట్లు ఖర్చు చేయించాడు శంకర్. దానికి ముందు కూడా ఈయన సినిమా బడ్జెట్ కోటలు దాటుతుంది. తొలి సినిమా జెంటిల్ మెన్ నుంచి నిన్నటి 2.0 వరకు కూడా శంకర్ బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గలేదు. కావాలంటే తాను రెమ్యునరేషన్ కట్ చేసుకుంటాడు కానీ బడ్జెట్ మాత్రం తగ్గించడానికి నో అంటాడు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడు ఈ దర్శకుడు. అలాంటి సంచలన దర్శకుడు ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యే మొదలైన ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా బడ్జెట్ విషయంలో అప్పుడే లెక్కలేయడం మొదలు పెట్టారు అభిమానులు. అయితే ఈ సారి మాత్రం అలాంటి భారీ బడ్జెట్ ఉండదని ముందు నుంచి ప్రచారం జరుగుతున్నా కూడా కేవలం మొన్న విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ కోసమే 1.73 కోట్లు ఖర్చు చేయించినట్లు తెలుస్తుంది.

ఈ పోస్టర్‌లో శంకర్‌తో పాటు హీరో హీరోయిన్లు, మిగిలిన కాస్ట్ అండ్ క్య్రూ ఉన్నారు. తన సినిమా కాన్సెప్ట్ పోస్టర్ కోసమే కోటిన్నరకు పైగా ఖర్చు చేయించాడు శంకర్. ఇప్పుడు ఓ సీక్వెన్స్ కోసం భారీగా ఖర్చు చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. సినిమాలో 7 నిమిషాల పాటు సాగే ఓ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని.. దానికోసం ఏకంగా 70 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. సినిమాలో అత్యంత కీలకంగా వచ్చే సీన్ కోసం శంకర్ తగ్గేదే లే అంటున్నాడు. ఈ లెక్కన రేపు సినిమా పూర్తయ్యే వరకు ఎంత బడ్జెట్ అవుతుందనేది ఊహకు కూడా అందడం లేదు. ఈ సినిమాను సెన్సేషనల్ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నాడు.

Unmarried actress in Tollywood: టాలీవుడ్‌లో 30 దాటినా పెళ్లి కాని హీరోయిన్లు ఇంత మంది ఉన్నారా..?


అంతేకాదు తన నిర్మాణంలో రాబోయే 50వ సినిమా కావడం విశేషం. నాలుగేళ్ళ కింద అల్లు అర్జున్ డిజే సినిమాతో 25 సినిమాల మైలురాయి అందుకున్నాడు దిల్ రాజు. ఈ నాలుగేళ్ళలోనే మరో 24 సినిమాలు పూర్తి చేసాడు. ఇప్పుడు 50వ సినిమా వైపు వస్తున్నాడు. బడ్జెట్ కారణంగా శంకర్ ఇప్పటి వరకు విమర్శలు బాగానే ఎదుర్కొన్నాడు. 2.0 సినిమాకు భారీ నష్టాలు రావడానికి.. కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమా మధ్యలో ఆగిపోవడానికి కారణం హై బడ్జెట్టే. 200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నాడు శంకర్. కానీ నిర్మాత మధ్యలోనే తప్పుకున్నాడు. దాంతో ఇండియన్ 2ను పక్కనబెట్టి మరీ రామ్ చరణ్ సినిమాను శంకర్ పూర్తి చేయబోతున్నాడు.

Pawan Kalyan - Chiranjeevi: చిరంజీవి రీమేక్‌లో పవన్ కళ్యాణ్.. ప్లాన్ వర్కవుట్ అయితే బొమ్మ బ్లాక్‌బస్టర్..!


Remake movies in 2021: ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన 9 రీమేక్ సినిమాలు ఇవే..


రామ్ చరణ్ సినిమా ఎలా ఉండబోతుంది.. దాని జోనర్ ఏంటనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. దీనిపై తాజాగా కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలోనే రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య టెక్నికల్ సినిమాల వైపు వెళ్లిన శంకర్.. రామ్ చరణ్‌తో మాత్రం పొలిటికల్ థ్రిల్లర్ చేయబోతున్నాడు. ఇందులో ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్ ఉండవని.. కేవలం కథా ప్రధానంగా సాగే కథ ఇది అని తెలుస్తుంది. శివాజీ తర్వాత శంకర్ నుంచి మామూలు సినిమా రాలేదు. మధ్యలో స్నేహితుడు చేసినా అది రీమేక్. అన్నీ టెక్నికల్, సైన్స్ ఫిక్షన్ సినిమాలు చేస్తున్నాడు శంకర్. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి రిస్కులు లేకుండా పొలిటికల్ థ్రిల్లర్ చేయబోతున్నాడు ఈ దర్శకుడు. బడ్జెట్ మాత్రం ఎప్పట్లాగే ఔట్ ఆఫ్ కంట్రోల్ అయ్యేలా కనిపిస్తుంది. ఈ సినిమా కోసం 250 కోట్లు దిల్ రాజు కేటాయించాడని తెలుస్తుంది. ఇందులో కియారా అద్వానీ, శ్రీకాంత్, సునీల్, జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను రెండు మూడేళ్లు కాకుండా కేవలం ఒకే ఏడాదిలో పూర్తి చేయాలని చూస్తున్నాడు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Ram Charan, Shankar, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు