Niharaika: నిహారిక కొణిదెల ‘మ్యాడ్ హౌస్’ చూసారా..

నిహారిక కొణిదెల ఒక వైపున తనదైన శైలిలో ఒక పద్దతిగా సినిమాలు చేస్తూనే ఉంది. అంతేకాదు..మరోవైపు తన టేస్ట్‌కు తగ్గ వెబ్ సిరీస్‌లు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా నిహారిక..

news18-telugu
Updated: September 23, 2019, 8:26 PM IST
Niharaika: నిహారిక కొణిదెల ‘మ్యాడ్ హౌస్’ చూసారా..
నిహారిక (File Photo)
  • Share this:
నిహారిక కొణిదెల ఒక వైపున తనదైన శైలిలో ఒక పద్దతిగా సినిమాలు చేస్తూనే ఉంది. అంతేకాదు..మరోవైపు తన టేస్ట్‌కు తగ్గ వెబ్ సిరీస్‌లు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఇక మెగా డాటర్ నటించిన ‘ఒక మనసు’, ‘హ్యాపీ వెడ్డింగ్’, తాజాగా నటించిన ‘సూర్యకాంతం’ సినిమాలేవి నిహారికకు హిట్టు ఇవ్వలేకపోయాయి. దాంతో నిహారిక సినిమాలను పక్కనపెట్టి వెబ్ సిరీస్‌లపై దృష్టి సారించింది. తాజాగా నిహారకి తన ఓన్ బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై ‘మ్యాడ్ హౌస్’ అనే రొమాంటింక్ కామెడీ డ్రామాతో నడిచే వెబ్ సిరీస్ చేస్తోంది. ఈ వెబ్ సిరీస్‌ను మహేష్ ఉప్పల డైరెక్ట్ చేస్తున్నాుడ. ఈ వెబ్ సిరీస్ 100 ఎపిసోడ్లుగా రానుంది.

తెలుగులో వెబ్ సిరీస్‌లో 100 ఎపిసోడ్స్ అంటే మాములు విషయం కాదు. మరి వెబ్ సిరీస్‌తో నిహారిక ఆకట్టుకుంటుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం పెదనాన్న చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరిసింహారెడ్డి’లో బోయపిల్ల పాత్రలో నటించింది. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 23, 2019, 8:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading