Home /News /movies /

MEGA DAUGHTER NIHARIKA KONIDELA JONNALAGADDA REVIEW ON ZOMBI REDDY MOVIE TA

Niharika Review On Zombie Reddy Movie: జాంబీ రెడ్డి సినిమాపై నిహారిక రివ్యూ..

జాంబీ రెడ్డి మూవీపై నిహారిక (Instagram/Photo)

జాంబీ రెడ్డి మూవీపై నిహారిక (Instagram/Photo)

Niharika Review On Zombi Reddy Movie: గత కొంత కాలంగా మెగా డాటర్.. నిహారిక కొణిదెల సినిమాలు చూస్తూ.. తనదైన శైలిలో రివ్యూలు కూడా ఇస్తోంది. తాజాగా నిహారిక జాంబీ రెడ్డి మూవీపై రివ్యూ ఇచ్చింది.

    Niharika Review On Zombi Reddy Movie: గత కొంత కాలంగా మెగా డాటర్.. నిహారిక కొణిదెల సినిమాలు చూస్తూ.. తనదైన శైలిలో రివ్యూలు కూడా ఇస్తోంది. ఇప్పటికే క్రాక్, మాస్టర్ వంటి సినిమాలు చూసి రివ్యూలు ఇచ్చిన నిహారిక..తాజాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జాంబీ రెడ్డి’ మూవీపై తనదైన శైలిలో స్పందించడంతో పాటు రివ్యూ కూడా ఇచ్చేసింది. జాంబీ రెడ్డి విషయానికొస్తే.. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన మూడో సినిమా జాంబి రెడ్డి. మొదటి సినిమా 'అ!' తోనే జాతీయ అవార్డు పొందిన టాలెంట్ ఉన్న యువ దర్శకుడు.. ఆ సినిమా ఇచ్చిన పాపులారిటీతో ప్రశాంత్ వర్మ ఆ తర్వాత సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా వచ్చిన కల్కి సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదలై ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంతగా ఆకట్టుకోలేక పోయింది. దీంతో కొంత గ్యాప్ తీసుకుని కొత్త కాన్సెప్ట్‌తో పక్కాగా వచ్చిన ప్రశాంత్ వర్మ తన మూడో సినిమాను జాంబిల నేపథ్యంలో ఓ కొత్త కాన్సెప్ట్‌తో రూపోందించాడు.

    తెలుగులో జాంబీ సినిమాలు కొత్త అని చెప్పవచ్చు. అయితే హాలీవుడ్‌లో మాత్రం ఇలాంటీ సినిమాలు చాలా కామన్. అక్కడ ఈ జాంబి కథలు ఎప్పడి నుండో పాపులర్. ఈ జానర్‌‌ను తెలుగు వారికి పరిచయం చేశాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా ఎప్పుడో రెడీ అయినా కరోనా కారణంగా ఫిబ్రవరి 5న విడుదలచేశారు. ఇక ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటించాడు. బాలనటుడిగా చిరంజీవి ఇంద్ర సినిమాలో కనిపించి మెప్పించిన తేజ జాంబి రెడ్డితో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తేజ ఆ మధ్య సమంత ఓ బేబీ సినిమాలో నటించినా.. హీరోగా మాత్రం ఇదే మొదటి సినిమా.


    ఈ సినిమాపై నిహారిక తనదైన రివ్యూ ఇచ్చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ అంటూ ప్రశంసలు కురిపించింది. ఇపుడే జాంబీ రెడ్డి సినిమా చేసాను. తెలుగులో ఇదే మొదటి జాంబీ చిత్రం. ఈ  సినిమాను ప్రశాంత్ వర్మ.. కామెడీతో నవ్వించినట్టు చెప్పుకొచ్చింది. ప్రశాంత్ వర్మ.. నీ డైరెక్షన్ బాగుంది. తేజ నీ యాక్టింగ్ సూపర్. నీ నటనలో 20 ఏళ్ల ఎక్స్‌పీరియర్స్ కనిపించిందంటూ బాలనటుడిగా తేజ్ చేసిన సినిమాలను గుర్తు చేసింది. ఈ సినిమాలో దక్ష, ఆనంది, హేమంత్, గెటప్ శ్రీను అందరు నటించారు. మార్క్స్ అందించిన సంగీతంతో సినిమా మరో స్థాయికి వెళ్లింది. సినిమా మేకప్‌తో పాటు అన్ని డిపార్టెమెంట్స్ అన్ని బాగున్నాయని కితాబు ఇచ్చింది. ఈ సందర్భంగా జాంబీ రెడ్డి టీమ్‌కు ప్రశంసలు కురిపించింది. మరోవైపు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Niharika konidela, Prashanth varma, Tollywood, Zombie Reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు