HOME »NEWS »MOVIE »mega daughter niharika konidela given review on vijay vijay sethupathi master movie pk

Master review by Niharika: ‘మాస్టర్’ పీస్ అంతే.. విజయ్ సినిమాపై నిహారిక రివ్యూ..

Master review by Niharika: ‘మాస్టర్’ పీస్ అంతే.. విజయ్ సినిమాపై నిహారిక రివ్యూ..
మాస్టర్ సినిమాపై నిహారిక రివ్యూ (Master Niharika Vijay)

Master review by Niharika: విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన మాస్టర్ సినిమాకు వస్తున్న వసూళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్న సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలతో పాటు అన్నిచోట్లా విజయం సాధించింది.

  • Share this:
విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన మాస్టర్ సినిమాకు వస్తున్న వసూళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్న సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలతో పాటు అన్నిచోట్లా విజయం సాధించింది. ఇప్పటికే దాదాపు 100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది మాస్టర్. మానగరం, ఖైదీ తర్వాత వరసగా మూడో విజయం అందుకున్నాడు లోకేష్. నెగిటివ్ టాక్‌తోనే సినిమా మొదలైనా కూడా ఇప్పుడు బ్లాక్‌బస్టర్ స్థాయికి చేరుకుంది మాస్టర్. మరీ ముఖ్యంగా లాక్‌డౌన్ తర్వాత ఓపెన్ అయిన థియేటర్స్‌కు ప్రేక్షకులను రప్పించడంలో మాస్టర్ సినిమా కీలక పాత్ర పోషించింది. సూపర్ స్టార్ కావడంతో అభిమానులు కూడా క్యూ కట్టారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రంపై మెగా డాటర్ నిహారిక అదిరిపోయే రివ్యూ ఇచ్చింది. ఇది చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు. దాదాపు ఏడాది తర్వాత థియేటర్‌లో తాను చూసిన తమిళ సినిమా మాస్టర్ అంటూ ట్వీట్ చేసింది నిహారిక. థియేటర్‌లో చూస్తున్నపుడు తనకు పండగలా అనిపించిందని చెప్పింది నిహా. విజయ్ నటనకు తాను ఫిదా అయిపోయానంటుంది నిహారిక. అంతేకాదు విజయ్ సేతుపతి కుమ్మేసాడని.. ఆయన తన ఫేవరేట్ అని.. ఎప్పట్లాగే సేతుపతి సర్ నటన అదుర్స్ అంటూ థమ్స్ అప్ ఇచ్చేసింది నిహారిక. దర్శకుడు లోకేష్ కనకరాజ్ కూడా అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడని.. డైలాగ్స్ కూడా తనకు చాలా బాగా నచ్చాయని రివ్యూ ఇచ్చింది నిహారిక.

తనకు ఖైదీ సినిమా చాలా బాగా నచ్చిందని.. అలాగే ఇప్పుడు మాస్టర్ కూడా ఫుల్లుగా ఎంజాయ్ చేసానని చెప్పింది మెగా డాటర్. అనిరుధ్ మ్యూజిక్ కూడా అదిరిపోయిందని.. ఫుల్లుగా పండగ చేసుకున్నానని చెప్పింది ఈమె. తన బుర్రలోంచి ఆ పాటలు బయటికి వెళ్లడం లేదని చెప్పింది నిహారిక. ఇక సినిమాలో ఉన్న విజయ్ సేతుపతి స్నానం చేసే సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పింది. ఆ సీన్ అయితే నెక్ట్స్ లెవల్‌లో ఉందని.. చించేసారంటూ చెప్పుకొచ్చింది నిహారిక.
Published by:Praveen Kumar Vadla
First published:January 24, 2021, 20:47 IST