‘సైరా.. నరసింహారెడ్డి’ విడుదల తేదిపై మెగా కంపౌండ్ క్లారిటీ.. ఇంతకీ ఎపుడంటే..

గత  కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ అక్టోబర్ 2న కాకుండా.. అక్టోబర్ 8న విడుదల చేయబోతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమా విడుదల తేదిపై వస్తున్న వార్తలపై మెగా కాంపౌండ్ క్లారిటీ ఇచ్చింది.

news18-telugu
Updated: August 31, 2019, 6:05 PM IST
‘సైరా.. నరసింహారెడ్డి’ విడుదల తేదిపై మెగా కంపౌండ్ క్లారిటీ.. ఇంతకీ ఎపుడంటే..
‘సైరా నరసింహారెడ్డి’లో
  • Share this:
గత  కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ అక్టోబర్ 2న కాకుండా.. అక్టోబర్ 8న విడుదల చేయబోతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. రూ.250 కోట్లతో నిర్మించిన సినిమాను పోటీ లేకుండా విడుదల చేస్తేనే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు భారీగా వస్తాయి. కానీ మరో భారీ సినిమా వస్తున్నపుడు పోటీకి వెళ్లి విడుదల చేస్తే కచ్చితంగా ఇద్దరూ నష్టపోతారు. ఇప్పుడు ఈ విషయాన్ని అర్థం చేసుకున్న నిర్మాత రామ్ చరణ్ తన సినిమాను వాయిదా వేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీనికి కారణం హిందీలో అదే రోజు హృతిక్ రోషన్, టైగర్ ష్రాప్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వార్' రిలీజ్ అవుతోంది. దీనిపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా వల్ల కచ్చితంగా సైరా హిందీలో నష్టపోవడం ఖాయం. అందువల్లే ఈ సినిమాను వాయిదా వేసినట్టు వార్తలు వెలుబడ్డాయి.‘వార్’ సినిమా వల్ల ‘సైరా’కు నార్త్‌లో సరైన థియేటర్స్ కూడా దొరకడం లేదని తెలుస్తుంది. ఎందుకంటే అక్కడున్నది యశ్ రాజ్ ఫిల్మ్స్. వాళ్లు ‘వార్’ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కించారు.

Sye Raa Narasimha Reddy movie will postponed and Producer Ram Charan will announce new release date pk అవును.. నమ్మడానికి ఇది కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు రామ్ చరణ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. దానికి కారణాలు కూడా ఉన్నాయి. sye raa,sye raa movie,sye raa movie twitter,sye raa movie release date,sye raa movie postpone,sye raa postponed,sye raa chiranjeevi,chiranjeevi ram charan sye raa,sye raa hindi version,sye raa war movies,telugu cinema,సైరా,సైరా నరసింహా రెడ్డి,సైరా వాయిదా,సైరా విడుదల వాయిదా,తెలుగు సినిమా,చిరంజీవి రామ్ చరణ్ సైరా
సైరా వార్ సినిమా పోస్టర్స్


ఐతే..‘వార్’ సినిమా వల్ల ‘సైరా..నరసింహారెడ్డి’  సినిమా విడుదల తేదిపై వస్తున్న వార్తలను ‘సైరా’ టీమ్ ఖండించింది. ముఖ్యంగా ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులను టార్గెట్ చేసి తెరకెక్కించిన సినిమా. హిందీలో చిరంజీవికి మార్కెట్ లేదు కాబట్టి.. అమితాబ్ బచ్చన్‌తో కాస్తో కూస్తో ఈ సినిమాకు కలెక్షన్లు రాబట్టుకోవచ్చనే ఉద్దేశ్యంతో బిగ్‌బీని ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నట్టు బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తమిళం, కన్నడ వెర్షన్స్ కోసం విజయ్ సేతుపతి,సుదీప్‌లను తీసుకోవడం వెనక  వెనక ఇదే స్ట్రాటజీ ఉందని చెబుతున్నారు. కాబట్టి ఈ సినిమాను ఆరూ నూరైనా  అక్టోబర్ 2నే విడుదల చేయబోతున్నట్టు మెగా కంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 31, 2019, 6:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading