• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • MEGA BROTHERS CHIRANJEEVI WITH HIS OWN BLOOD BROTHERS PAWAN KALYAN NAGABABU IN BAVAGARU BAGUNNARA 100 DAYS FUNCTION PHOTO GOES VIRAL ON SOCIAL MEDIA TA

Mega Brothers: మెగా బ్రదర్స్ చిరంజీవి పవన్ కళ్యాణ్, నాగబాబు అపూర్వ కలయిక.. సోషల్ మీడియాలో వైరల్..

Mega Brothers: మెగా బ్రదర్స్ చిరంజీవి పవన్ కళ్యాణ్, నాగబాబు అపూర్వ కలయిక.. సోషల్ మీడియాలో వైరల్..

మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్,నాగబాబు (File/Photo)

Mega Brothers - Chiranjeevi - Pawan Kalyan - Nagababu | అవును మెగా బ్రదర్స్ .. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కలిసిన ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో అభిమానులు షేర్ చేస్తున్నారు.

  • Share this:
    Mega Brothers - Chiranjeevi - Pawan Kalyan - Nagababu | అవును మెగా బ్రదర్స్ .. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కలిసిన ఈ ఓల్డ్ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో మెగాభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఈ ముగ్గురు కలిసిన ఈ ఫోటో బావగారూ బాగున్నారా వంద రోజుల వేడుక సందర్భంగా తీసినది. ఇక బావగారు బాగున్నారా సినిమా టైటిల్ విషయానికొస్తే.. మాస్టర్ సినిమాలో బాగున్నారా.. బాగున్నారా అంటూ బావగారూ బాగున్నారా అంటూ ఓ పాట ఉంది. ఆ పాట పల్లవిలోని చరణం తీసుకొని ఈ సినిమాకు ఆ పేరు పెట్టారు. చిరంజీవి ‘బిగ్‌బాస్’, ‘రిక్షావోడు’ వంటి డిజాస్టర్స్ తర్వాత ఒక యేడాది గ్యాప్ తీసుకొని ‘హిట్లర్’ సినిమాతో ముందుకొచ్చారు. ఈ సినిమా సక్సెస్ అయింది. ఆ తర్వాత ‘మాస్టర్’ సినిమా కూడా హిట్టైయింది.

    ఈ రెండు సినిమాల్లో చిరంజీవి కాస్త గంభీరమైన పాత్రలే చేసారు. అందుకే కాస్త డిఫరెంట్‌గా ఉండాలని జయంత్ సి.పరాన్జీ  దర్శకత్వంలో పరుచూరి బ్రదర్స్ రచనలో తమ్ముడు నాగబాబు చెందిన తమ హోం ప్రొడక్షన్స్ హౌస్‌ అంజనా ప్రొడక్షన్స్‌లో చిరంజీవి ‘బావగారూ బాగున్నారా’ సినిమా చేసారు.

    అవును మెగా బ్రదర్స్ .. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కలిసిన ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో అభిమానులు షేర్ చేస్తున్నారు.
    చిరంజీవి ‘బావగారూ బాగున్నారా’ (File/Photo)


    ఈ చిత్రంలో రంభ, రచన హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమాలో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలవడమే కాదు. మ్యూజికల్‌గా మంచి హిట్టైయింది. ఇక చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం కూడా ఇదే. ఇక నిర్మాతగా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నాగబాబు నిర్మించిన చిత్రాల్లో హిట్ అనిపించుకున్న ఏకైక చిత్రం కూడా ‘బావగారూ బాగున్నారా’ మాత్రమే. ఈ సినిమాలో చిరంజీవి పెద్ద కొండపై నుంచి తాళ్లు కట్టుకొని లోయలోకి బంగీ జంప్ అనే సాహసం చేసారు. ఈ సినిమాలో చిరంజీవి కనిపించే ఫస్ట్ షాట్ ఇదే. ఈ సినిమాలో సారీ సారీ అనే పాటలో నాగబాబు గెస్ట్‌గా కనిపించారు.  ఈ సినిమాలో బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, శ్రీహరిల కామెడీ హైలెట్. ఈ సినిమాను హిందీలో అల్లు అరవింద్.. గోవిందా హీరోగా ‘కువారా’ పేరుతో రీమేక్ చేసారు. బంగ్లాదేశ్‌లో ‘జమై షషూర్’ పేరుతో రీమేకైంది. ఈ చిత్రం వంద రోజుల వేడుకలో మెగా బ్రదర్స్ ముగ్గురు ఒకే వేదికపై మెరిసారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు