news18-telugu
Updated: June 27, 2020, 10:08 AM IST
నాగబాబు (Twitter/Nagababu)
ఈ సారైనా.. మెగా బ్రదర్ నాగబాబు చిరకాల కోరిక తీరబోతుందా. వివరాల్లోకి వెళితే.. కొణిదెల శివ శంకర్ వర ప్రసాద్ నుంచి చిరంజీవిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆపై సుప్రీం హీరోగా, మెగాస్టార్‌గా ఆశేష తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు చిరంజీవి. 42 ఏళ్ల ఫిల్మ్ కెరీర్లో చిరంజీవి మొదటి సారి చారిత్రక పాత్రైనా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి క్యారెక్టర్‌ను ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో పోషించాడు. ఈ సినిమా తెలుగులో బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. చిరంజీవి ఇప్పటి వరకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డ్స్‌తో పాటు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు ఎన్నో అందుకున్నారు. కానీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డును మాత్రం అందుకోలేదు.

సైరా పోస్టర్
ఇపుడు చేసిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో చిరంజీవి చారిత్రక పాత్ర పోషించలేదన్న లోటు తీర్చుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాతోనైనా..చిరంజీవి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకోవాలని నాగబాబు చాలా సందర్భంలో తన కోరికను బయట పెట్టాడు.ఈ సారి కరోనా లేకపోయి ఉంటే జాతీయ అవార్డులను కేంద్ర ప్రకటించేది. కానీ లాక్డౌన్ నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ అవార్డులను తాత్కాలికంగా పక్కనపెట్టింది. మరోవైపు తెలుగు నుంచి ఉత్తమ నటుడి జాబితాలో చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాతో పాటు బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాలను జ్యూరీ పరిశీలనకు పంపించారు. ఈ రెండు సినిమాలతో పాటు హృతిక్ రోషన్.. సూపర్ 30 సినిమాతో పోటీ పడుతున్నారు. ఇంకోవైపు అజయ్ దేవ్‌గణ్ ‘తానాజీ’ తో పాటు రణ్వీర్ సింగ్ గల్లీబాయ్‌తో పాటు.. ధనుష్ రెండు సినిమాలు, మలయాళం మోహన్ లాల్, మమ్ముట్టి కూడా పోటీపడుతున్నారు. ఇంత పోటీలో తెలుగులో చిరు, బాలయ్యలకు ఈ అవార్డు వస్తుందా అనేది చూడాలి. మొత్తంగా జ్యూరీ దృష్టిలో తెలుగు హీరోలు నిలుస్తారా అనేది చూడాలి.మరి మరి నాగబాబు చెప్పినట్టే ‘సైరా ...నరసింహారెడ్డి’చిత్రంతో చిరంజీవి నిజంగానే జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకొని నాగబాబు చిరకాల కోరిక తీరుస్తాడా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
First published:
June 27, 2020, 10:08 AM IST