NagaBabu | మెగా బ్రదర్ నాగబాబు నేను యోధుడిని కాదు.. ఓ రోగిని అంటూ వ్యాఖ్యలు చేసారు. వివరాల్లోకి వెళితే.. రీసెంట్గా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా. ఈ విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. ఆ తర్వాత నాగబాబు కరోనా నుంచి కోలుకున్నట్టు అదే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పాటు ప్రేక్షకులకు తెలియజేసారు.అంతేకాదు హోం ఐసోలేషన్ తర్వాత తాను కరోనాతో ఎదుర్కొన్న అనుభవాలు, తీసుకున్న జాగ్రత్తలను వీడియో ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా తాను ఐదుసార్లు కరోనా టెస్టులు చేయించుకున్నట్టు తెలిపారు. నిహారిక ఎంగేజ్మెంట్ కోసం ముందుగా కరోనా టెస్ట్ చేయించుకున్నట్టు తెలిపారు.అంతేకాదు కరోనాకు సంబంధించిన స్వల్ప లక్షణాలు ఉన్న వెంటనే కరోనాకు టెస్ట్ చేయించుకోవాలన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. నేను కరోనాను జయించిన యోధుడిని కాదు. అంటువ్యాధి నుంచి కోలుకున్న రోగిని అంటూ చెప్పుకొచ్చారు.
నాగబాబు (Youtube/Credit)
అంతేకాదు తనకు ఎన్నో ఏళ్లుగా ఆస్తమా ఉంది. అదే సమయంలో తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఎంతో కంగారు పడ్డానన్నారు. వెంటనే ట్రీట్మెంట్ కోసం ఓ హాస్పిటల్‌లోని ఐసోలేషన్ వార్డులో చేరాను. ఈ సందర్భంగా కొన్ని సార్లు ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డనన్నారు. మూడో రోజులకు నేను వాసన గుర్తించే లక్షణాన్ని కూడా కోల్పోయినట్టు చెప్పారు. డాక్టర్స్ ఇచ్చిన మెడిసన్స్‌ను టైమ్ ప్రకారం వేసుకోవడంతో కొన్ని రోజుల్లోనే కరోనా నుంచి కోలుకున్నట్టు తెలిపారు. దీంతో డాక్లర్టు తనను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చాక మరో వారం రోజుల పాటు తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు.
నాగబాబు (Twitter/Nagababu)
అదే సమయంలో ఇంట్లో తన శ్రీమతి పద్మజకు కూడా కోవిడ్ 19 పాజిటివ్‌గా అని తేలింది. దీంతో భార్యాభర్తలిద్దరం స్వీయ గృహనిర్భంధంలో ఉన్నట్టు తెలిపారు. కరోనా అనేది మాకిద్దరికి ఎంతో కఠిన పరిస్థితులను నేర్పించింది. అయినా.. మేమిద్దరం కరోనా నుంచి కోలున్నాం. ఇక నా భార్య పద్మజ ఎంతో ఆరోగ్యవంతురాలు కాబట్టి తొందరగా కోలుకుంది. నేను కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అయితే మాములు లైఫ్‌లో రావడానికి తనకు ఎంతో సమయం పట్టిందన్నారు మెగా బ్రదర్ నాగబాబు.
నాగబాబు ప్లాస్మా దానం (Nagababu/Photo)
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. మీలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే.. ఆలస్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోండి అంటూ చెప్పారు. అలా చేయంచుకోవడం వల్ల.. ఇంట్లో వాళ్లతో పాటు మిగతా వాళ్లను కూడా కరోనా బారిన పడకుండా కాపాడవచ్చన్నారు. ఇక కరోనాను జయించిన తర్వాత నాగబాబు ప్లాస్మా దానం చేసిన సంగతి తెలిసిందే కదా.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.